Advertisement
ప్రపంచంలో అన్ని బంధాల కంటే భార్య, భర్తల బంధం చాలా గొప్పది. ఎందుకంటే రెండు వేరు వేరు వాతావరణాలలో పెరిగిన వ్యక్తులు కలిసి ఓ బంధాన్ని ఏర్పరుచుకుని జీవితాంతం కలిసి ఉంటారు. ఈ బంధంలో నమ్మకం, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, గౌరవం చాలా ముఖ్యం. అయితే.. రెండు వేరు వేరు కుటుంబాల నుంచి వ్యక్తులు అవడం వలన సహజంగానే కొన్ని సందేహాలు వస్తూనే ఉంటాయి. తమ పార్టనర్ తమను మోసం చేస్తున్నారా? అన్న సందేహాలు రావడం సహజం. అయితే.. ఈ 4 టిప్స్ తో వారు మిమ్మల్ని మోసం చేయడం లేదు అని తెలుసుకోవచ్చు.
Advertisement
1. నిజాయితీ: మీ పార్ట్ నర్ మీతో ఏ విషయాన్నీ అయినా ఓపెన్ గానే చెప్తారు. వారి మనసులో ఏదీ దాచుకోరు. ఆఖరుకి మీ పై వారికి ఫీలింగ్స్ విషయంలో అయినా మీతో ఓపెన్ గానే ఉంటారు. ఇలా ఉంటే.. వారు మిమ్మల్ని మోసం చేయలేరనే అర్ధం.
Advertisement
2. గౌరవం: మీ పట్ల ఎంతో గౌరవంగా ఉంటారు. నలుగురు ఉన్నప్పుడు మిమ్మల్ని గౌరవించడమే కాకుండా.. మీ పట్ల ప్రేమాభిమానాలను కలిగి ఉంటారు. మీ అభిప్రాయాలను, భావాలను గౌరవిస్తారు. ఇలా ఉంటె వారు మిమ్మల్ని మోసం చేయడం లేదని అర్ధం.
3. టైం స్పెండ్ చేయడం: మీ పట్ల ప్రేమ ఉండే భాగస్వామి మీతో సమయం గడపాలని ఆశిస్తారు. కొంత సేపు అయినా మీ సమక్షంలో ఉండాలని కోరుకుంటారు. ఇవేమీ లేకుండా మీనుంచి ప్రయోజనాలను మాత్రమే ఆశిస్తూ ఉంటె అప్పుడు అనుమానించాలి.
4. మీకోసం సమయం కేటాయిస్తారు: ఎంత బిజీ షెడ్యూల్ లో ఉన్నా వారు మీకంటూ కొంత సమయాన్ని కేటాయించడానికి ఇష్టపడతారు. మీరంటే ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటే.. వారు మిమ్మల్ని ఎప్పటికి మోసం చేయలేరని అర్ధం.