Advertisement
కోకాపేట భూములు వేలంలో రికార్డును సృష్టిస్తున్నాయి. ఉదయం నుంచే కొనసాగుతున్న వేలంలో భూముల కోసం రియల్ ఎస్టేట్ కంపెనీలు గట్టిగానే పోటీ పడుతున్నాయి. తాజాగా కోకాపేటలోని నియో పోలీస్ భూములు వేలంలో ఎవ్వరూ కూడా ఊహించని రీతిలో అధిక ధర పలికాయి. ఒక ఎకరం ఏకంగా రూ.100 కోట్లు పలకడం విశేషం.
Advertisement
ప్లాట్ నెం.10 కోసం బిడ్డింగ్ రూ.100 కోట్లు దాటింది. ఏపీఆర్, రాజ్ పుష్ప కంపెనీల మధ్య బిడ్డింగ్ హోరా హోరీగా సాగుతుంది. అంతకు ముందు ప్లాట్ నెంబర్ 9లో ఎకరం భూమి ధర రూ.76.50 కోట్లు పలికింది. మొత్తం రూ.250 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. 10వ నెంబర్ ప్లాట్ లో 3.60 ఎకరాల భూమి ఉంది. 11వ నెంబర్ ప్లాట్ లో 7.53 ఎకరాలు, 14వ నెంబర్ ప్లాట్ లో 7.34 ఎకరాలు ఉంది. ఈ మూడింటికి వేలం కొనసాగుతోంది.ఈ వేలంలో దిగ్గజ రియల్ ఎస్టేట్ కంపెనీలు పోటీ పడ్డాయి. హెచ్ఎండీఏ ఎకరం భూమికి కనీస ధర రూ.35కోట్లుగా నిర్ణయించింది.
Advertisement
అయితే నియో పోలీస్ ఫేజ్ 2లోని 6,7,8,9 ప్లాట్ల వేలం ద్వారా హెచ్ఎండీఏకి రూ.1,532.50 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. తాజాగా నిర్వహించిన వేలంతో ఇప్పటిరవకు కోకాపేట నియో పోలీస్ లో 26.86 ఎకరాలకు వేలం పూర్తి అయింది. ప్రస్తుతం నియో పోలీస్ లో 10, 11, 14 ప్లాట్లకు వేలం కొనసాగుతుంది. ఈ ప్లాట్లకు కూడా భారీగానే ధర పలికే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోకాపేటలో 49 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి 2వేల కోట్ల వరకు ఆదాయం వచ్చినట్టు సమాచారం.