Advertisement
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక.. చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవడం అనేది మూడు ప్రధాన పార్టీలకు చావో-రేవో అనే పరిస్థితి ఉంది. టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపిలకు మునుగోడులో గెలుపు అనేది చాలా ముఖ్యం. ఇందులో గాని ఓడితే ఆ ప్రభావం సాధారణ ఎన్నికలపై గట్టిగా పడుతుంది. అయితే ఇక్కడ కాస్త కాంగ్రెస్ సేఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరిగింది. ఏ ఎన్నికల్లోను గెలవలేదు. కాబట్టి ఇక్కడ ఓడినా సరే కాంగ్రెస్ కు ఇంకా పెద్ద డ్యామేజ్ ఏం జరగదు.
Advertisement
అయితే, ఈ నేపథ్యంలోనే, టీపీసీసీ స్టార్ క్యాంపెనర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో లీక్ అయింది. మునుగోడులో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ కాల్ చేసిన మాటలు ఇందులో రికార్డ్ అయ్యాయి. ఓ కాంగ్రెస్ లీడర్ తో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చచ్చినా బతికిన రాజగోపాల్ రెడ్డి సహాయం చేస్తూ ఉంటారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని ఫోన్ కాల్ చేశారు. అయితే, కోమటిరెడ్డి వెంకటరెడ్డిదిగా చెబుతున్న ఆడియో క్లిప్ ఘటన మరువకముందే మరో వీడియో బయటకొచ్చింది.
Advertisement
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన వెంకటరెడ్డి తనను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన అభిమానులతో ఎయిర్పోర్టులో మాట్లాడారు. తాను వెళ్లి మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసిన గెలవదని కోమటిరెడ్డి అన్నారు. 10 ఓట్లు ఎక్కువ పడతాయి తప్ప కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదని బాహటంగా వ్యాఖ్యానించారు. “నేను ప్రచారం చేసినా కాంగ్రెస్ గెలవదు. కాంగ్రెస్ పార్టీకి నేను ప్రచారం చేసిన పది ఓట్లు ఎక్కువ పడతాయి కానీ గెలవదు. ఐదు సార్లు ఉన్న ఎమ్మెల్యే, ఎంపీగా ఉన్న తెలంగాణ కోసం కోట్లాడిన. రిటైర్ అయిపోతా హ్యాపీగా. 25 ఇయర్స్ గా పాలిటిక్స్ లో కొనసాగుతున్న. పాదయాత్ర చేద్దామంటే కాంగ్రెస్ లో ఒక్క గ్రూపా?” అంటూ కోమటిరెడ్డి అన్నారు. దీన్ని అక్కడున్న ఓ అభిమాని సెల్ ఫోన్ లో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ లెక్కన మునుగోడు ఫలితాల తర్వాత.. వెంకట్ రెడ్డి… రాజకీయాల నుంచి దూరం కానున్నారని తెలుస్తోంది.
read also : T20 World Cup: చరిత్ర సృష్టించిన జింబాబ్వే.. 15ఏళ్లలో తొలిసారి