Advertisement
ఉన్న ఊరిని, కన్నతల్లిని, నమ్ముకున్న కుటుంబాన్ని వదిలి దేశం కోసం త్రివిధ దళాల సైనికులు పహారా కాస్తుంటారు. దేశమే తన కుటుంబమని అనుకుంటారు. పుట్టిన మట్టికోసం దేనికైనా తెగిస్తారు. అలాంటి గొప్ప సైనికులు వీర మరణం పొందితే.. వారి కుటుంబాలను ఆదుకోవాలి.. దేశం కోసం దేహాన్ని వదిలేసే ఆ మహనీయులను అందించిన కుంటుంబాలకు అండగా నిలబడాలని అన్నారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
Advertisement
రెండు రోజుల క్రితం అరుణాచల్ ప్రదేశ్ లో భారతీయ సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఆ రాష్ట్రంలోని మండలా ప్రాంతంలో ఇది జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం గ్రామానికి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ భానురెడ్డి ఒకరు. ఆయన మృతి బాధాకరమన్నారు కోమటిరెడ్డి.
Advertisement
వినయ్ భానురెడ్డి భార్య స్పందన ఆర్మీలో డెంటిస్ట్ గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు(హానిక, హారిక). ప్రస్తుతం మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరిలో నివాసం ఉంటున్నారు. దేశం కోసం విధులు నిర్వహిస్తూ.. ప్రాణాలు విడిచిన వినయ్ భానురెడ్డి కుటుంబసభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడాలని తెలిపారు వెంకట్ రెడ్డి.
కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 50 లక్షల ఎగ్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ చొరవ తీసుకుని ఆ కుటుంబానికి అండగా నిలబడాలని కోరారు.