Advertisement
ప్రతిభ గల విద్యార్థులు ఎవరూ ఇబ్బందులు పడకూడదని పరితపిస్తుంటారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఆర్థికంగా సతమతం అవుతున్న విద్యార్థులకు సాయం చేస్తుంటారు. ఎంతోమంది తాము అనుకున్న లక్ష్యాలను చేరుకున్నారంటే అది కోమటిరెడ్డి చేయూత వల్లే సాధ్యమైంది. ఈ ఏడాది 30 మందికి పైగా విద్యార్థులకు సాయం చేశారు.
Advertisement
తాజాగా మరో ఇద్దరు విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్గొండలోని గొల్లగూడకు కొలిమేర ప్రసన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఈమె తండ్రి దయాకర్ ఓ హోటల్లో పని చేస్తున్నాడు. కుటుంబం ఆర్థికంగా సతమతం అవుతున్న విషయం తెలుసుకున్న ఎంపీ.. 50 వేల రూపాయల సాయం చేశారు. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా చెక్కును అందజేశారు.
Advertisement
అలాగే.. నల్గొండ జిల్లా కనగల్ మండలం జీ యెడవల్లి గ్రామానికి చెందిన కొప్పుల అనిల్.. ఖమ్మం జిల్లాలోని మమత మెడికల్ కాలేజీ లో సీటు సాధించాడు. అనిల్ తండ్రి లింగయ్య కూలీ పని చేస్తుంటాడు. ప్రతిక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా 75 వేల రూపాయల సాయం చేశారు కోమటిరెడ్డి. ప్రతీక్ రెడ్డి ఫౌడేషన్ సీఈవో గోనరెడ్డి గారు చెక్కు పంపిణీ చేశారు.
నాలుగు రోజుల క్రితం.. భువనగిరి జిల్లా నాంచారిపేటకు చెందిన గంధమళ్ల భవాని అనే విద్యార్థిని అమెరికాలో ఎంబీఏ చదివేందుకు వెళ్తుండగా.. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ తరఫున విమాన ఖర్చుల కోసం రూ.లక్ష సాయం చేశారు వెంకట్ రెడ్డి. ఇక తన కుమారుడు ప్రతీక్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ప్రతీక్ రెడ్డి జూనియర్ కాలేజీలో 200 బెంచీలు, మౌలిక వసతులకు 10 లక్షల రూపాయలు అందజేశారు.నల్లగొండ ప్రభుత్వ మహిళా కాలేజీలో 200 బెంచీలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనుల కోసం 10 లక్షల రూపాయల చెక్కును ఇచ్చారు. అదేరోజు నల్గొండకు చెందిన కె.అలివేలు అనే ఎంబీబీఎస్ విద్యార్థినికి ఫీజు కోసం రూ.75 వేలు ఇచ్చారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.