Advertisement
బాగా చదివే విద్యార్థులను గుర్తించి వారికి ఆర్థిక సాయం చేయడంలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ముందుంటుంది. చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తరచూ విద్యార్థులకు సాయం చేస్తూనే ఉంటారు. ఈ సంవత్సరం 30 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ సీటుకు కావాల్సిన ఫీజును సాయంగా అందించారు.
Advertisement
ఈక్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా నాంచారిపేటకు చెందిన గంధమళ్ల భవాని అనే విద్యార్థిని అమెరికాలో ఎంబీఏ చదివేందుకు వెళ్తుండగా.. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ తరఫున విమాన ఖర్చుల కోసం రూ.లక్ష సాయం చేశారు వెంకట్ రెడ్డి. ఆమె అనుకున్న లక్ష్యాలకు చేరుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ గల విద్యార్థులకు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ అండగా ఉంటుందని చెప్పారు.
Advertisement
మరోవైపు తన కుమారుడు ప్రతీక్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ప్రతీక్ రెడ్డి జూనియర్ కాలేజీలో 200 బెంచీలు, మౌలిక వసతులకు 10 లక్షల రూపాయలు అందజేశారు కోమటిరెడ్డి. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా టాయిలెట్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. అలాగే నల్లగొండ ప్రభుత్వ మహిళా కాలేజీలో 200 బెంచీలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనుల కోసం 10 లక్షల రూపాయల చెక్కును అందజేశాశారు.
నల్గొండకు చెందిన కె.అలివేలు అనే ఎంబీబీఎస్ విద్యార్థినికి కూడా అండగా నిలబడ్డారు. డబ్బులు లేక చదువు ఆపేయాలని ఆమె నిర్ణయించుకోగా.. విషయం తెలిసి ఈ ఏడాది ఫీజు కోసం రూ.75 వేలు ఇచ్చారు కోమటిరెడ్డి. అలాగే అలివేలు ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు ఖర్చంతా భరిస్తామని ధైర్యం చెప్పారు. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా కోమటిరెడ్డి చేస్తున్న సాయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.