Advertisement
కొండా సురేఖ వరుస వివాదాల్లో చిక్కుకున్నారు. మంత్రిగా ఉంటూ చేస్తున్న వ్యాఖ్యలు, నిర్ణయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమస్యలు తీసుకువస్తోంది. ప్రతిపక్షాలకి అస్త్రంగా మారింది. నాగార్జున కుటుంబం పైన చేసిన వ్యాఖ్యలతో జాతీయస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. మంత్రి బాధ్యతలో ఉండి పోలీస్ స్టేషన్ కి వెళ్లి సీఐ సీట్లో కూర్చోవడం వివాదాస్పదంగా మారింది. సురేఖ వ్యవహారం పై ఏఐసిసి సైతం ఇప్పటికే రేవంత్ రెడ్డికి స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.
Advertisement
ఆమె దూకుడు కొన్ని సమస్యలకు కారణం అవుతోంది. కేటీఆర్ ని టార్గెట్ చేసే క్రమంలో సమంత గురించి సురేఖ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపింది. కేటీఆర్ అంశం పక్కకు పోయి సురేఖ టార్గెట్ అయ్యింది. తర్వాత ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా వివాదం మాత్రం ముగిసిపోలేదు.
Advertisement
Also read:
సురేఖ పైన హీరో నాగార్జున కేసు దాఖలు చేశారు. అమల నేరుగా ప్రియాంక గాంధీతో ఈ విషయం గురించి మాట్లాడారు. పార్టీ నాయకత్వం సైతం సురేఖ విషయంలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. సొంత పార్టీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గీయులతో సురేఖ మధ్య విభేదాలు పోలీస్ స్టేషన్ కి చేరాయి. సీఐ కుర్చీలో ఆమె కూర్చోవడం మరో వివాదానికి కారణమైంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!