Ads
Krishna Vrinda Vihari Review and Rating in Telugu : నాగశౌర్య వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, చలో వంటి సినిమాలతో హిట్ కొట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల వరుడు కావలెను సినిమాతో పలకరించిన నాగశౌర్య తాజాగా నటించిన చిత్రం ‘కృష్ణ వృంద విహారి‘. పాపులర్ సింగర్ షేర్లి సేతియా హీరోయిన్ గా తొలిసారిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతుంది. ఈ మూవీ ఇవాళ అంటే సెప్టెంబర్ 23న పేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
Krishna Vrinda Vihari Review and Rating: కథా మరియు వివరణ:
సాంప్రదాయ బ్రాహ్మిన్ కుర్రాడైన కృష్ణ (నాగశౌర్య) తాను వర్క్ చేసే ఆఫీస్ లో నార్త్ అమ్మాయి అయినా వృంద (షిర్లీ సేతియా) తో ప్రేమలో పడతాడు. ఆమెను మెప్పించేందుకు చాలా ప్రయత్నాలు చేసి ప్రేమలో పడేస్తాడు. ఇద్దరి పెళ్లికూడా అవుతుంది. పెళ్లి తర్వాత వారు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి, వారి కుటుంబ సభ్యులు కృష్ణా మరియు వృంద యొక్క వివాహం కు ఎలా స్పందిస్తారు. విభిన్నమైన అలవాట్లు ఉన్న వారిద్దరి వైవాహిక జీవితం ఎలా సాగింది అనేది కథ.
Advertisement
ఈ సినిమా మాత్రం కొత్త సినిమా కంటెంట్ అయితే కాదు. అలాగని సినిమా బోర్ కొట్టదు. పాత సినిమా కథలాగే ఉన్నా, ఫన్నీ సన్నివేశాలతో ఫీల్ గుడ్ పాటలతో సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. కృష్ణా ఫ్యామిలీతో హీరోయిన్ కలిసిపోయే సందర్భంలో పండించిన కామెడీ చాలా సహజంగా ఉంటుంది. మొదటి భాగం మొత్తం లవ్ చుట్టే తిరుగుతుంది. దీనికి తగ్గట్టు కథ ఇంకా కొంచెం బలంగా ఉంటే సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయేది. ముఖ్యంగా ఈ సినిమా స్టార్టింగ్ లో “ఏ ముందే” పాట అందరిని ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. మొత్తానికి సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పలేం. అలాగని చెత్తగా ఉందని కూడా చెప్పలేం. మొత్తానికి సినిమా చూడవచ్చు.
ప్లస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు
కామెడీ ట్రాక్
నాగశౌర్య
మైనస్ పాయింట్స్:
కథ మరియు కథనం, ఎడిటింగ్,
కథలో బలమైన పాత్రలు చూపించలేదు
రేటింగ్: 2.5/5
READ ASLO : ప్రణీత భర్త ఏం చేస్తాడో తెలుసా.. అతనికి ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా ?