Advertisement
మునుగోడు ఉప ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్ది ప్రధాన పార్టీల మధ్య పొలిటికల్ వార్ పీక్స్ కి చేరుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి పార్టీ ఇచ్చే కాంట్రాక్టుల కోసమే ఆ పార్టీలో చేరారని టిఆర్ఎస్ మొదటినుండి బలంగా విమర్శిస్తోంది. ఇటీవల మంత్రి జగదీష్ రెడ్డి బిజెపిని ఉద్దేశిస్తూ రాజగోపాల్ రెడ్డికి బిజెపి ఇచ్చిన 18 వేల కోట్లను మునుగోడు నియోజకవర్గానికి ఖర్చు చేస్తే ఉప ఎన్నిక తప్పుకుంటామని సవాల్ విసిరారు.
Advertisement
Read also: తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక ?
అయితే జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కొనసాగిస్తూ మంత్రి కేటీఆర్ అటు కోమటిరెడ్డి బ్రదర్స్, ఇటు ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ సంచలన ట్వీట్ చేశారు. ఇటీవల తెలంగాణ భవన్ లో జరిగిన టిఆర్ఎస్ విద్యార్థి విభాగం సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వాళ్లు కోమటిరెడ్డి లు కాదు.. కోవర్ట్ రెడ్డిలు అని సంచలన ఆరోపణలు చేశారు. కోవర్టు ఆపరేషన్ చేసే ఈ చిల్లర రాజకీయాన్ని మునుగోడు ప్రజలకు తెలపాలని అన్నారు మంత్రి కేటీఆర్. అటు ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ.. ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుడు అయితే దేశ సంపద మెరుగు పడదని అన్నారు.
Advertisement
మరొక వ్యక్తికి కాంట్రాక్టు ఇస్తే జిల్లా బాగుపడదని.. అలాగే నల్గొండ జనం ప్రయోజనం ముఖ్యం మోడీ గారు అంటూ ట్వీట్ చేశారు. ” నీతి అయోగ్ ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం మిషన్ భగీరథ కి 19,000 కోట్లు కేటాయించమని సిఫారసు చేస్తే పెడచెవిన పెట్టారు. రాజకీయ ప్రయోజనం కోసం ఒక వ్యక్తికి 18,000 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు. ఇప్పటికైనా మోడీ గారు నల్గొండ జిల్లాకు 18,000 కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తే పోటీ నుండి తప్పుకుంటాం. దీనికి బిజెపి సిద్ధమా?” అని ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు. కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ ఉప ఎన్నిక తీసుకోవచ్చారని మండిపడ్డారు. మునుగోడు ప్రజలను అంగడి సరుకులా కొంటానని నరేంద్ర మోడీ ప్రదర్శించిన అహంకారానికి, మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికనే మునుగోడు ఉప ఎన్నిక అని అన్నారు కేటీఆర్.
Read also: ఢిల్లీ లిక్కర్ స్కాం లో కల్వకుంట్ల కవితకు బిగ్ రిలీఫ్ !