Advertisement
kukkuta Sastram in Telugu: కుక్కట శాస్త్రం, కోడి పుంజులు, రకాలు తెలుగులో : సాధారణంగా మానవులు పంచాంగ శాస్త్రాన్ని ఏవిధంగా అన్వేషిస్తారో.. అదేవిధంగా కోళ్లకు కూడా ఓ ప్రత్యేక పంచాంగ శాస్త్రం ఉంటుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. కోళ్లకు ఉండే ప్రత్యేక పంచాంగ శాస్త్రం పేరు కుక్కుట శాస్త్రం. సంక్రాంతి పండుగ రోజు చాలా ప్రాంతాల్లో కోడీ పందెంలను నిర్వహిస్తుంటారు. కోడి పందాలు వేసే వారికి ఈ కుక్కుట శాస్త్రం గురించి చాలా బాగా తెలుసు.
Advertisement
కోడీ పందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతుండటం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. కోట్ల రూపాయలు ఖర్చు చేసి పందెంలను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా కోళ్లను కూడా పెంచుతారు. పందాల కోసం కోళ్లను లక్షలు వచ్చెంచి కొంటుంటారు. అంతేకాదు.. పందెం కోసం వీటికి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తారు. శిక్షణ పూర్తి అయిన తరువాతనే కోళ్లను పందానికి తీసుకెళ్తారు.
kukkuta Sastram Telugu కుక్కట శాస్త్రం, కోడి పుంజులు, రకాలు తెలుగులో
కోడి పుంజు రకాలు |
కోడి పుంజు లక్షణాలు |
---|---|
గేరువా | లేత ఎరుపు రంగులో వీటికి ఈకలు ఉంటాయి. |
అబ్రాసు | వీటి ఈకలు లేత బంగారువర్ణంలో ఉంటాయి. |
ముంగిస | ముంగిస జూలు వర్ణంలో ఈకలు ఉంటాయి |
పింగళ | అక్కడక్కడా నలుపు రంగు, గోధుమ రంగులు ఉంటాయి . ఎక్కువ రెక్కలు తెలుపు రంగులోనే ఉంటాయి. |
ఎర్రపొడ | |
నల్లబోర | |
పూల | ఒక్కో ఈక నలుపు, ఎరుపు, తెలుపు రంగులలో కలిసిపోయి ఉంటాయి. |
మైల | ఈకలు ఎరుపు, బూడిద రంగులలో కలిసి ఉంటాయి. |
కౌజు | ఈకలు మూడు రంగులలో ఉంటాయి. పసుపు, ఎరుపు, నలుపు. |
నెమలి | రెక్కలపై మరియు వీపుపై ఈకలు ఉంటాయి. |
డేగ | ఈ పుంజుకి ఈకలు అన్ని మెత్తగా ఎర్రగా ఉంటాయి. |
కొక్కిరాయి | ఈ పుంజు శరీరం నల్లగా, రెండు నుంచి మూడు రకాల ఈకలు ఉంటాయి. |
సవల | మెడపై నల్లటి ఈకలు ఉంటాయి |
పర్ల | ఈ పుంజుకి మెడపై తెలుపు, నలుపు రంగుల ఈకలు సరిసమానంగా ఉంటాయి. |
సేతు | ఈకలు అన్నీ తెలుపులోనే ఉంటాయి. |
కాకి | ఈ పుంజు ఈకలు నలుపులోనే ఉంటాయి. |
పురాణాల ప్రకారం.. పందెం కోసం కోళ్లను కుక్కుల శాస్త్రం ప్రకారమే ఎంచుకునే వారట. వాటికి సంబంధించిన జాతకాలు కుక్కుట శాస్త్రంలో సవివరింగా ఉంటాయి. సంస్కృతంలో కోడిని కుక్కుట అని పిలుస్తారు. అందుకే ఈ శాస్త్రానికి కుక్కుట శాస్త్రం అనే పేరు వచ్చింది. ఇక ఈ శాస్త్రంలో కోడి పుంజులను ఎలా పెంచాలి ? వాటి వర్గీకరణ, ఏ నక్షత్రంలో పుట్టింది కోడి, వాటి జాతకం ఏంటి అనే వివరాలు అన్ని కుక్కుట శాస్త్రంలో ఉంటాయి.
Advertisement
2015లో భారత సుప్రీంకోర్టు కోడి పందెంలను నిషేదించింది. కానీ 2016లో తెలంగాణ న్యాయస్థానం సమర్థించింది. అయినప్పటికీ కోడి పందాలు నిర్వహించడం మాత్రం మానడం లేదు. 2018లో కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది సుప్రీంకోర్టు. పందెంలో పాల్గొనేటటువంటి కోళ్లకు కత్తులు కట్టకూడదని, ఎలాంటి రక్తపాతం జరుగవద్దు అనే షరతులు విధించింది. కానీ ఆ షరతులను మాత్రం ఎవ్వరూ పాటించడం లేదు.
ఈ కుక్కట శాస్త్రం ను ఎవరు రాశారనే విషయం మాత్రం తెలియదు. కానీ పందానికి వెళ్లే ముందు కచ్చితంగా కుక్కుట శాస్త్రాన్ని అనుసరిస్తారు. ఇందులో ముఖ్యంగా కోడి పుంజులను ఎలా పెంచాలి, కోడి ఏ నక్షత్రంలో పుట్టింది, వాటికి సంబంధించిన జాతకం ఏంటి? వాటి వర్గీకరణ వంటి పూర్తి వివరాలు ఉంటాయి. కోడి పుంజుల రకాలు, కోడి పుంజులను పందెంకి ఎంచుకోవాలి, ఏ సమయంలో కోడి పందెం వేయాలి అనే విషయాలను కుక్కుట శాస్త్రంలో వివరించారు.
ప్రధానంగా కోడిపందెంలో కోళ్లను ఏ రోజు ఏ దిశలో వదిలితే మంచి ఫలితాలుంటాయనే విషయాలు కూడా ఇందులో ఉంటాయి. శుక్రవారం, ఆదివారం ఉత్తర దిశలో, శనివారం, సోమవారం దక్షిణ దిశలో, మంగళవారం తూర్పు దిశలో, బుధవారం, గురువారం పడమర దిశలో వదలాలి అని ఈ శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా ఈకల రంగులను బట్టి పందెం కోళ్ళ రకాలను విభజించారు. అదేవిధంగా కోడి పుంజులకు సంబంధించి మొత్తం 27 నక్షత్రాలు ఉంటాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా సంక్రాంతి పండుగ సమయంలో కోడి పందెంలు జరుగుతుంటాయి. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు,కృష్ణ జిల్లాలలో ఎక్కువగా కోడి పందెంలు కొనసాగుతుంటాయి. సంస్కృతంలో కోడిని కుక్కుట అని పిలవడంతో..
కోళ్ల పంచాంగానికి సంబంధించిన శాస్త్రాన్ని కుక్కట శాస్త్రం అనే పేరు వచ్చిందట. కోడి పందెంలు ప్రారంభానికి ముందు ఈ కుక్కుట శాస్త్రంకి సంబంధించిన పంచాంగం చదివితే తమకు సంబంధించినటువంటి కోళ్లు విజయం సాధిస్తాయని చాలా మంది నమ్ముతారు.
సాధారణంగా కుక్కుట శాస్త్రం అంటే ఏంటో చాలా మందికి తెలియదు. మనుషులు పంచాంగమును ఏవిధంగా నమ్ముతారో.. కోళ్లకు కూడా ప్రత్యేక పంచాంగ శాస్త్రం ఉంది. ముఖ్యంగా కోడి పందెంలలో పందెం కాసేవారికి ఈ కుక్కుట శాస్త్రం చాలా బాగా ఉపయోగపడుతుంది.
పూర్వకాలంలో యుద్ధానికి వెళ్లే ముందు హిందువులు భగవద్గీతను అన్వేషించినట్టే.. కోడి పందెంలకు వెళ్లే వారు కూడా ఈ కుక్కుట శాస్త్రంని అనుసరించే వారని పూర్వికులు పేర్కొంటున్నారు.