Advertisement
నిన్నటితో ప్రపంచ కప్ సందడి ముగిసిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఈ ఆట చాలా రసవత్తరంగా సాగింది. చివరి ఆట వరకు ఒక్క ఆటలో కూడా ఓడిపోని ఇండియా.. ఫైనల్స్ లో మాత్రం తడబడింది. ఫలితంగా వరల్డ్ కప్ ఆస్ట్రేలియా సొంతం అయ్యింది. ఈ వరల్డ్ కప్ అందరు క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. మరో వరల్డ్ కప్ రావాలంటే మాత్రం ఇంకో నాలుగేళ్లు ఆగాల్సిందే. అయితే.. ఇప్పుడు ఉన్న ఆటగాళ్లందరూ అప్పుడు ఉండకపోవచ్చేమో.
Advertisement
నెక్స్ట్ వరల్డ్ కప్ 2027 లో ఉంటుంది. ప్రస్తుతం 36 సంవత్సరాల రోహిత్ ఇప్పటికే ఫిట్నెస్ సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇక నెక్స్ట్ వరల్డ్ కప్ ఆయన ఆడకపోవచ్చేమో. ఇక 39 సంవత్సరాల షమీ కూడా నెక్స్ట్ వరల్డ్ కప్ కి ఉండకపోవచ్చు. ప్రస్తుతం జోరు మీద ఉన్న పేసర్ అశ్విన్ కూడా ప్రస్తుతం 37 ఏళ్ల వయసులో ఉన్నాడు. మరో నాలుగేళ్లు తిరిగేసరికి ఆయన కూడా వరల్డ్ కప్ ఆడకపోవచ్చు. 34 ఏళ్ల వయసు ఉన్న జడేజా కూడా కనిపించకపోవచ్చనే చెప్పాలి. ఇక కోహ్లీకి నెక్స్ట్ వరల్డ్ కప్ సమయానికి 39 ఏళ్ళు వచ్చేస్తాయి. అయితే.. ఫిట్ నెస్ లో పర్ఫెక్ట్ గా ఉండే కోహ్లీ వరల్డ్ కప్ ఆడే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.
Advertisement
అనుకోకుండా ఛాన్స్ దక్కించుకున్న ఏంజెలో మాధ్యుస్, వన్ డే రిటైర్మెంట్ నుంచి బయటకు వచ్చిన బెన్ స్టోక్స్ తదుపరి వరల్డ్ కప్ ఆడకపోవచ్చు. మహమ్మద్ నబి (38) , వార్నర్ (37), స్మిత్ (34), మాక్స్వెల్, స్టార్క్ (33) లు కూడా 2027 లో వరల్డ్ కప్ ఆటకి ఉండకపోవచ్చు. 33 సంవత్సరాల కేమ్స్ విలియంసన్, 34 సంవత్సరాల బౌల్ట్, 36 సంవత్సరాల షకిబుల్ హాసన్, డేవిడ్, మొయిన్ ఆలీ, ఆదిల్ రషీద్, క్రిస్ వోక్స్, బవుమా, మిల్లర్, వాండర్ డసన్ వంటి ఆటగాళ్లందరికి ఇదే చివరి వరల్డ్ కప్ కావచ్చు. నెక్స్ట్ మ్యాచ్ కి వీరు ఉండకపోవచ్చు.