Advertisement
జ్ఞాని లాస్య నందిత తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. 2016 జిహెచ్ఎంసి ఎన్నికల్లో కవాడీగూడా డివిజన్ నుండి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. లాస్య నందిత 2023లో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గ నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచారు. లాస్య నందిత హైదరాబాద్ అశోక్ నగర్ లో జి సాయన్న గీత దంపతులకు పుట్టారు ఆమె కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చదువుకున్నారు. లాస్య నందిత తండ్రి దివంగత ఎమ్మెల్యే జి సాయన్న అడుగుజాడల్లో 2017లో రాజకీయాల్లోకి వచ్చారు 2017 లో జరిగిన కంటోన్మెంట్ బోర్డ్ ఎన్నికల్లో నాలుగో వార్డ్ పికెట్ నుండి బోర్డు సభ్యురాలుగా పోటీ చేసే ఓడిపోయారు.
Advertisement
Advertisement
తర్వాత ఆమె తన తండ్రితో పాటుగా బీఆర్ఎస్ పార్టీలో చేరి 2016 జిహెచ్ఎంసి ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుండి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. 2021 లో జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుండి కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయారు. కంటోన్మెంట్ సెట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరి 19న అనారోగ్య కారణాలతో మరణించారు ఆయన మరణించడంతో 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ని లాస్య నందితకి బీఆర్ఎస్ పార్టీ కేటాయించింది 2024 ఫిబ్రవరి 23న ప్రయాణిస్తున్న కారు పటాన్చెరువు ఓఆర్ఆర్ సమీపంలో సుల్తాన్పూర్ సమీపంలో రోడ్డు రైలింగ్ ని ఢీకొట్టడం తో అదుపు తప్పి ఆమె చనిపోయారు.
తండ్రి మరణించిన ఏడాదికే లాస్య నందిత కూడా చనిపోవడం బాధాకరం ఆమె కుటుంబం తీవ్ర విషాదంతో మునిగిపోయింది. ఎమ్మెల్యే గా ఎన్నికైన మూడు నెలల్లోనే ఆమె రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. డ్రైవర్ అతివేగం నిద్రమత్తె ప్రమాదానికి కారణం అని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. నార్కట్పల్లి ప్రమాదంలో కారు దెబ్బతినగా కొత్త కారు కొనుగోలు చేశారు. ఆ కారు కూడా ప్రమాదానికి గురవడం ఆమె ప్రాణాలని కోల్పోవడం జరిగింది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకుని ప్రమాద ఘటన పై ఆరా తీస్తున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!