Advertisement
డబ్బు చాలా విలువైనది డబ్బు లేకపోతే ఏదీ లేదు. డబ్బు లేకుండా మన జీవితాలు ముందుకు కదలవు. మనం నిత్యం ఏం కొనుగోలు చేయాలన్నా డబ్బు చాలా అవసరం కరెన్సీ నోట్లకి సంబంధించి మనకు తెలియని చాలా విషయాలు కూడా ఉంటాయి. కరెన్సీ నోట్లను గమనిస్తే గీతలు ఉంటాయి. అసలు ఆ గీతలు ఏంటి..? వాటి వెనుక కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. ముఖ్యంగా నోట్ల అంచున వివిధ ఏటవాల గీతలు ఉంటాయి. ఇవేంటనేది చాలా మందికి తెలియదు. ఒక నోటు విలువబట్టి ఆ లైన్లు మారడం చాలామంది చూసి ఉంటారు.
Advertisement
ఎప్పుడైనా దాని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవడానికి చూశారా..? నోటు అంచుల ముద్రించిన ఈ ఏటవాలు గీతలు నిజానికి బ్లీడ్ మార్కులు. నోట్ల విలువను బట్టి పెరుగుతూ ఉంటాయి. ఈ లైన్ల వెనుక కారణం ఏంటంటే.. మనమందరం కరెన్సీ నోట్లను చూసి 100, 200, 500 అని తెలుసుకోవచ్చు కానీ అంధులు వాటిని గుర్తించలేరు. ఈ ప్రత్యేక లైన్లను అందులో కోసం ఏర్పాటు చేశారు వీటి సహాయంతో అందులకు నోట్ల విలువ అర్థమవుతుంది.
Advertisement
Also read:
కాబట్టి వాళ్ళని ఎవరూ మోసం చేయలేరు. ఈ పన్నులు భారతీయ రూపాయల్లో వంద నుండి 2000 వరకు ఉంటాయి. అంధుల వేళ్ళతో తాకితే ఆ నోట్లో విలువ అర్థమవుతుంది. భారత కరెన్సీ సృష్టికర్తలు అంధుల సౌలభ్యం కోసం ఈ లైన్లను ఏర్పాటు చేశారు ప్రతి నోటుకు దాని విలువకు అనుగుణంగా ఏటవాలు గీతలు ఉంటాయి. వంద రూపాయలు చూసినట్లయితే రెండు వైపులా నాలుగు లైన్లు కనబడతాయి. 200 నోట్లకు నాలుగు లైన్లు ఉంటాయి. 500 నోట్లకు 5 లైన్లు, 2000 రూపాయల నోట్లకు 7 లైన్లు ఉంటాయి. లైన్లు ని తాకి సులభంగా నోట్లను గుర్తించడానికి అవుతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!