Advertisement
ప్రస్తుతం ట్రెండింగ్ సినిమా కాంతారా. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ దేశవ్యాప్తంగా ప్రభంజనాన్ని సృష్టించింది కాంతారా. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం కాంతారా. ఈ ఏడాది నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది.
Advertisement
దాదాపు 16 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ సినిమా 450 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. కన్నడంతో పాటు బాలీవుడ్, టాలీవుడ్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. భూతలోక అనే కళ నేపథ్యంతో విలేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రిషబ్ శెట్టి ఈ సినిమాను తెరకెక్కించారు. నటుడిగా, దర్శకుడిగా ఈ సినిమాతో రిషబ్ శెట్టి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు.
ఇదిలా ఉండగా, ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో ఏదో ఒక చర్చ జరుగుతుంది. కొంతమంది ఈ సినిమా లాజిక్ లెస్ అని అంటున్నారు. ఈ సినిమా కథలోనే చాలా లాజిక్ మిస్ అయ్యిందట. ఆ మిస్టేక్ ఎలా గాలికి వదిలేశారు అంటూ నెటిజెన్లు నెత్తి కొట్టుకుంటున్న ఈమోజీలు పెడుతున్నారు. అసలు మేటర్ ఏంటంటే, ఈ సినిమాలో కోలం ఆడే వ్యక్తిలో దేవుడు ప్రవేశించి జరగబోయేది చెబుతుంటాడు. ఒక రాజు అడవిలో ఉండే జనాలకు తన భూమిని దానం చేస్తాడు. కొన్నాళ్ల తర్వాత అతని వారసుడు వచ్చి ఆ భూమి నాది అంటాడు. కోలం ఆడే వ్యక్తితో అతను నా భూమి నాకు కావాలి అంటాడు.
Advertisement
అప్పుడు ఆ కోలం ఆడే వ్యక్తిలో దేవుడు ప్రవేశించి ‘నువ్వు కోర్టు మెట్లపై రక్తం కక్కుకొని చనిపోతావు’ అంటాడు. అతను అన్నట్టే ఆ వ్యక్తి కోర్టు మెట్లపై రక్తం కక్కుకుని చనిపోతాడు. ఇంకొన్నాళ్ళ తర్వాత ఆ రాజ కుటుంబానికి చెందిన వారసుల్లో ఇంకో వ్యక్తి కూడా భూమిని ఆక్రమించుకోవాలి అని కుట్రలు పన్నుతుంటాడు. ఇదే క్రమంలో హీరో బాబాయి కొడుకు కోలం ఆడుతూ ఉంటాడు. క్లైమాక్స్ లో కోలం ఆడే వ్యక్తిని తన స్వార్థం కోసం చంపేస్తాడు ఆ రాజు కుటుంబానికి చెందిన వంశీయుడు.
అలాగే అక్కడి జనాలను కూడా దారుణంగా కాల్చి చంపేస్తాడు. చివర్లో హీరో కూడా కోలం ఆడతాడు. అతను తన ప్రజలను, వారికి సాయం చేసిన పోలీస్ ఆఫీసర్ కు అప్పగిస్తున్నట్లు సినిమాలో చూపించారు. అయితే కోలం ఆడే వ్యక్తిలో నిజంగా దేవుడు వస్తే, ఆ రాజు కుటుంబానికి చెందిన వ్యక్తి అనగా, ఆ ఊరికి పెద్దదిక్కు అని జనాలు నమ్ముతున్న వ్యక్తి దుర్మార్గుడు అని ఎందుకు ఆ ప్రజలకు చెప్పలేదు. ముందుగానే తెలియజేస్తే ఆ ప్రజలు జాగ్రత్త పడతారు కదా? అనేది నెటిజన్ల అభిప్రాయం. కానీ ఆ లాజిక్ ను ఏ మాత్రం మేకర్స్ పట్టించుకోలేదు. ఇక ప్రేక్షకులు కూడా ఈ లాజిక్ ను పూర్తిగా పక్కన పెట్టేసి స్క్రీన్ ప్లేని మాత్రమే ఎంజాయ్ చేశారు.
Read also: అరటి, కొబ్బరికాయలను మాత్రమే దేవుళ్లకు ఎందుకు సమర్పిస్తారో తెలుసా..?