Advertisement
ఈ రోజుల్లో చాలా మంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు ఇంట్లో వాళ్ళు కుదుర్చున పెళ్లి వద్దని ప్రేమ పెళ్లిలకే ఓకే చెప్తున్నారు. ఎక్కువగా ఈ రోజుల్లో అందరూ లవ్ మ్యారేజ్ లని ప్రిఫర్ చేస్తున్నారు అయితే ప్రేమ లో జాగ్రత్తగా ఉండడం కూడా ముఖ్యం. కొంత మంది ప్రేమించి మోసపోతూ ఉంటారు. పెద్దల కుదిర్చిన పెళ్లి చేసుకుంటే ఎవరో తెలియని వ్యక్తి లైఫ్ లోకి వస్తారని చాలా మంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు అయితే వాళ్లలో మోసపోయే వాళ్ళు కూడా ఉన్నారు.
Advertisement
ఇదిలా ఉంటే తాజాగా ఒక సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందని తల్లిదండ్రులు ఆ కుమార్తె కి మామూలు శిక్ష వేయలేదు ఒక ఘోరమైన శిక్షనే వేశారు. బతికుండగానే కర్మకాండలు చేసి పిండ ప్రధానం చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే… మధ్య ప్రదేశ్లోని జబల్పూర్ లో ఇది చోటు చేసుకుంది.
Advertisement
అమ్ ఖేరా ప్రాంతానికి చెందిన అనామిక దూబే ఓ ముస్లిం అతన్ని ప్రేమించింది. వాళ్ళ పెళ్లి ఈ నెల 7 వ తేదీన అయింది. ఆమె అతన్ని పెళ్లి చేసుకున్నాక ఆమె పేరును ఉజ్మా ఫాతిమాగా మార్చేసుకుంది. కోర్టును సంప్రదించి ముస్లిం సంప్రదాయం ప్రకారం ఈ జంట వివాహం చేసుకున్నారు. కూతురు చేసిన ఈ పనికి తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. తీవ్ర మనస్థాపానికి గురై కూతురు లేదంటూ ఆమె బతికి ఉండగానే నర్మదా నది తీరాన అంతిమ సంస్కారాలు చేసేసారు.
కుమార్తె చనిపోయిందని పిండ ప్రదానానికి రమ్మని కార్డ్స్ ని కూడా ప్రింట్ చేయించారు. ఇతర మతస్థుడిని పెళ్లి చేసుకుని వారి పరువు తీసిందని ఆదివారం నర్మదా నది వద్ద గౌరీ ఘాట్ లో పిండ ప్రదానం చేశారు. బంధువులు కూడా వచ్చారు. పెళ్లి కోసం ఎన్నో అనుకున్నాం.. కలలు కన్నాం కానీ ఇప్పుడు పిండ ప్రదానం ఇలా చేయాల్సి వస్తుందని అనుకోలేదని ఆమె సోదరుడు చెప్పుకొచ్చాడు.
Also read:
బాబోయ్ ఇంత పెద్ద హింట్ ని అల్లు అరవింద్ ఇచ్చారా..? వీడియో వైరల్..!