Advertisement
ప్రేమ అన్నమాటకు సంబంధించి మనలో చాలా మనోభావం ఉంటుంది. దాని గురించి రకరకాల ఊహలు నిర్వచనాలు చేస్తూ ఉంటాం. ఒక్కసారి ఇష్టపడిన అమ్మాయి తన ప్రేమను ఒప్పుకుంటే అతడే మహారాజు. ప్రేమలో మునిగిపోయిన ప్రేమికులు ఏం చేస్తారో చెప్పడం చాలా కష్టం. కొంతమంది చుట్టూ ఉన్న లోకాన్ని మర్చిపోతారు. మరికొంతమంది ఎవ్వరూ చూడకుండా జాగ్రత్తగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఏదో ఒకటి ఇచ్చుపుచ్చుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా, ఇప్పుడు ఓ క్యూట్ లవ్ స్టోరీని మీరు ఆ ప్రేమికుడి మాటల్లోనే చూడండి.
Advertisement
2015లో, నాకు ఈ పిల్లర్ పక్కన కూర్చున్న అమ్మాయికి ఒకే చోట ఉద్యోగాలు వచ్చాయి. సాయంత్రం కాగానే ఈ రైల్వే స్టేషన్ కు వచ్చి, ఇద్దరం వేర్వేరు ట్రైన్ ఎక్కి, మా మా ఇళ్లకు వెళ్లే వాళ్ళం. ఆ అమ్మాయి పరిచయమయ్యాక తొలిసారి తీసుకున్న సెల్ఫీ ఇది.
Advertisement
అప్పటినుండి ఆ అమ్మాయికి నేను పెట్టుకున్న నిక్ నేమ్ పిల్లర్ నెంబర్-9. పరిచయం పెరిగాక, ఓ రోజు ఆమెతో పాటే వారి ఇంటి వరకు ట్రైన్ లో వెళ్ళొచ్చా, అప్పుడు తీసుకున్న సెల్ఫీ ఇది. రైల్వే స్టేషన్ లోనే తనకు ప్రపోజ్ చేశా! (స్నేహం కాస్త, ప్రేమ పట్టాలెక్కింది).
సినిమాలు, షికారులు, పార్కులు, రెస్టారెంట్లు ఇలా మా ప్రేమ ఎక్స్ప్రెస్ ట్రైన్ ల దూసుకెళ్లింది. ఇది మా పెళ్లి షాపింగ్ చేస్తుండగా దిగిన ఫోటో, పిల్లగాడికి అంటే నాకు, పిల్లర్ నెంబర్ 9 మేడమ్ కి పెళ్లి అయిన రోజు,
ఇది పిల్లర్ మేడమ్, పిల్లగాడి ఇంటికి పర్మినెంట్ గా వచ్చిన ఫోటో. దేవుడు మమ్మల్ని ఓ చిట్టి తల్లితో దీవించేశాడు.