Advertisement
రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఓ జంట ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ బైక్ డ్రైవింగ్ లో ఉన్న సమయంలో ముద్దు పెట్టుకోవడంతో ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి రద్దీగా ఉండే రహదారిపై మోటారుసైకిల్‌ను నడుపుతుండగా, అతని వెనుక ఓ మహిళ కూర్చుని ఉంది. ఆమె తన లవర్ ని నడి రోడ్డు పైనే హాగ్ చేసుకుని కూర్చుంది.
Advertisement
అంతటితో ఆగకుండా తన ప్రియుడిని లిప్ టు లిప్ కిస్ చేసింది. అదే అదనుగా తీసుకున్న ఆ అబ్బాయి కూడా డ్రైవింగ్ చేస్తూనే వెనక్కి తిరిగి ఆమెకు ముద్దు పెట్టడం స్టార్ట్ చేసాడు. ముందుకి కూడా చూడకుండా డ్రైవ్ చేస్తూ వెనక తన ప్రియురాలికి ముద్దు పెడుతూ ఉన్నాడు. దీనితో వీరి వెనకాల వెహికల్ లో వస్తున్న వ్యక్తి దీనిని వీడియో తీసి ట్విట్టర్ లో పెట్టాడు. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయిపొయింది.
Advertisement
ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటు చేసుకుంది. ఆ వీడియో తీసిన వ్యక్తి తన పోస్ట్ లో జైపూర్ పోలీసులను కూడా టాగ్ చేసాడు. దీనితో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వైరల్ వీడియో గురించి సమాచారం అందుకున్న తరువాత, సీనియర్ ట్రాఫిక్ పోలీసు అధికారి చర్యకు ఆదేశించారు మరియు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు వారికి ఫైన్ కూడా విధించారు. “ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తి సోషల్ మీడియాలో ఇతర కార్యకలాపాలకు పాల్పడుతున్న వీడియో మాకు అందింది. వీడియోలో చూసిన రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా, మేము బైక్ ఓనర్ వివరాలు తెలుసుకుని, మోటారు వాహనాల చట్టం (MV) కింద చట్టపరమైన చర్య తీసుకున్నాం అని అని జైపూర్ ట్రాఫిక్ అధికారి తెలిపారు.
kitne ka chalan hona chaiye?@jaipur_police pic.twitter.com/HVq0Ufiq9Z
— rajni singh (@imrajni_singh) September 15, 2023
మరిన్ని..
మ్యాచ్ ఆడుతున్నప్పుడు టాయిలెట్ కి వెళ్లాల్సి వస్తే, క్రికెటర్స్ ఏమి చేస్తారు?
రాజమండ్రి జైలు సిబ్బందికి కొత్త తలనొప్పి ! ఇది కదయ్యా అభిమానం అంటే !