Advertisement
Maa oori Polimera 2 Review: త్వరలోనే రిలీజ్ కాబోయే మా ఊరి పొలిమేర 2 సినిమాకు సంబంధించి కథాంశం, సెన్సార్ మరియు రన్‌టైమ్ వివరాలు బయటకు వచ్చాయి. ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరియు ప్రధాన కథాంశం వివరాలను తెలుసుకోవడం సినిమా ప్రియులకు కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మా ఊరి పొలిమెరా 2 కథ ప్లాట్ – సెన్సార్ మరియు రన్‌టైమ్ వివరాలను తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.
Advertisement
Maa oori Polimera 2 Story: మా ఊరి పొలిమెర 2 కథ
అడ్రాసుపల్లిలో ఒక వరుస హత్య తర్వాత, ఆటో డ్రైవర్ కొమరయ్య తన మొదటి ప్రేమ కవితతో కేరళకు పారిపోయాడు. ఈ పరిస్థితి అతని సోదరుడు జంగయ్య అదృశ్యానికి దారితీస్తుంది. చివరకు ఈ డ్రామా నిధి వేట గురించి రివీల్ చేస్తుంది. ఇందులో కొమరయ్య కీలక పాత్ర పోషిస్తాడు. అడ్రాసుపల్లి చీకటి రాజ్యం పోలీసులు మరియు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇన్వొల్వెమెంట్ తో బయటకు వస్తుంది. అనేక అనూహ్య పరిస్థితులకు దారి తీస్తుంది. ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది చూపించారు.
ఈ సినిమా కథలోకి వెళ్తే… మల్లేశం చేతబడులు చేసి కొంతమందిని చంపి వేరే దగ్గరకి వెళ్ళిపోతాడు. అలా బతుకుతున్న మల్లేశంకి గుడి కి సంబంధించి ఒక వ్యక్తితో గొడవ అవుతుంది. అయితే, ఆ వ్యక్తి కి, మల్లేష్ కి, టెంపుల్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే దానితో ఈ మూవీ సాగుతూ ఉంటుంది. మరి మల్లేశం చివరికి మంచిగా మారాడా అసలు మల్లేశం చెడ్డవాడా, మంచివాడా అనేది తెలియాలంటే మూవీ చూడాలి.
Advertisement
ఈ మూవీ ని దర్శకుడు బాగా తీశారు. కథని చివరి వరకు ఎంగేజ్ చేస్తూ బాగా ప్రెజెంట్ చేశారు. అలానే ఈ మూవీ లో ప్రతి క్యారెక్టర్ ని అవసరం మేరకే వాడుతూ బాగా చూపించారు. సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాల్లోనే మనకి స్టోరీ చెప్పేస్తారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగుతుంది ఇది. మల్లేశం పాత్ర బావుంది. సత్యం రాజేష్ తన క్యారెక్టర్ ని అద్భుతంగా పోషించారు. అలానే కామాక్షి భాస్కర్ల కూడా బాగా నటించింది. గెటప్ శీను, బాలాదిత్య వాళ్ళ పాత్రలు కూడా ఒకే. మ్యూజిక్ అందించిన జ్ఞాని కూడా డిసప్పాయింట్ చేయలేదు. సినిమాటోగ్రాఫర్ రమేష్ రెడ్డి విజువల్స్ తో ఒక గ్రాండీయర్ ని తీసుకొచ్చాడు. ఎడిటింగ్ ని ఇంకా బాగా చూసుకుంటే బాగుండేది.
కాస్ట్ అండ్ క్రూ :
డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో సత్యం రాజేష్ మరియు కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలు పోషించిన మా ఊరి పొలిమెర 2 లో గెటప్ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య, సాహితీ దాసరి మరియు రవివర్మ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్లస్ పాయింట్స్:
సత్యం రాజేష్
స్టోరీ
దర్శకత్వం
స్క్రీన్ ప్లే
హారర్ సీన్స్
మైనస్ పాయింట్స్:
కొన్ని అనవసర సన్నివేశాలు
Rating: 2.75/5