Advertisement
Maha Shivaratri 2024: Wishes, Quotes, Messages, Images,Whatsapp Status in Telugu :హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలో మహాశివరాత్రి పండుగ కూడా ఒకటి. హిందువులందరూ కూడా మహాశివరాత్రి నాడు ప్రత్యేకించి శివుడిని కొలుస్తూ ఉంటారు. మహాశివరాత్రి నాడు హిందువులు ఆచరించే ముఖ్యమైన పనులు ఎన్నో ఉన్నాయి. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలు లో ఇది కూడా ఒకటి. శివపార్వతుల వివాహం కూడా ఈరోజు జరిగిందట శివుడు తాండవం చేసే రోజు శివరాత్రి అని పండితుడు అంటున్నారు. పంచాంగం ప్రకారం ఈసారి మహాశివరాత్రి మార్చి 8న వచ్చింది. ప్రతి ఏటా కూడా శీతాకాలం చివర్లో వేసవికాలం ముందు వచ్చే మార్గం మాసంలో మహాశివరాత్రి పండుగ వస్తుంది.
Advertisement
మహాశివరాత్రి చాంద్రమానం నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశినాడు వస్తుంది. ప్రతి ఏడాది కూడా మాగ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది శివరాత్రి పండుగ. శివపురాణం ప్రకారం ఈరోజు లింగాకారంగా శివుడు ఆవిర్భవించిన రోజట. సంవత్సరాల్లో 12 శివరాత్రుల్లో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనది. ఈరోజు శివుడిని ఆరాధిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది.
శివరాత్రి నాడు బిల్వ ఆకులు శివుడికి సమర్పించడం వలన చాలా మంచి జరుగుతుంది రోజంతా ఉపవాసం చేసి రాత్రి జాగరణ చేయాలి. శివ భక్తులకు అత్యంత పర్వదినం ఇది శివ భక్తులు తెల్లవారుజామునే లేచి తల స్నానం చేసి పూజలు చేసుకోవాలి ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి తర్వాత రోజు భోజనం చేయాలి రాత్రంతా శివ పూజలు అభిషేకాలు అర్చనలు చేస్తూ ఉండాలి మహాశివరాత్రి పండుగని అన్ని శైవ క్షేత్రాల్లో కూడా ఘనంగా జరుపుతారు.
Advertisement
మీ బంధుమిత్రులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇలా తెలపండి
- వందే శంభుముమాపతిం సురుగురుం వందే జగత్కారణం.. వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం.. వందే సూర్యశశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం.. వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం – శివరాత్రి శుభాకాంక్షలు
- బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగం జన్మజ దు:ఖ వినాశక లింగం తత్ ప్రణమామి సదాశివ లింగం.. మహాశివరాత్రి శుభాకాంక్షలు
- శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం.. శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం.. నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే.. నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి… హ్యాపీ శివరాత్రి..
- భీమా శంకరా.. ఓం కారేశ్వరా.. శ్రీకాళేశ్వరా.. మా ఎములాడ రాజరాజేవ్వరా.. మమ్మేలే మా ప్రాణేశ్వరా.. మా రక్ష నీవే ఈశ్వరా.. మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు..
- ఏమీ అర్థం కానివారికి పూర్ణలింగేశ్వరం.. అంతో ఇంతో తెలిసినవారికి అర్ధనారీశ్వరం శరణాగతి అన్నవారికి మాత్రం ఆయనే సర్వేశ్వరం.. మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు..
- హర హర మహదేవ శంభో శంకర..ఇహపరముల నేలే జయ జగదీశ్వర.. కోరిన వారి కోరికలన్నీ తీర్చేటిఈశ్వరుడి చల్లని దీవెనలు ఎల్లవేళలా మీకు అందాలని కోరుకుంటూ మీకు మీ బంధుమిత్రులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు..
- దోషదూషనాశ వినాశనా.. నాగభూశణాసృష్టికారణ, నష్టహరణ తమోరజోసత్వగుణ విమోచనా హరహర మహాదేవ శంభో శంకర! మహాశివరాత్రి శుభాకాంక్షలు.
- ముజ్జగాలు మురియ, ముక్కంటి యాడుచు వెండి కొండ పైన, వేడ్క గదురానర్త నంబు జేసె, నాట్య రాజటంచుసర్వ జనులు శివుని, సంస్తుతించ!
Maha Shivaratri 2024 Images in Telugu
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!