Advertisement
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు ఎంతటి కష్టకాలంలో ఉన్నారో తెలిసిన విషయమే. ఒకే ఏడాదిలో తన కుటుంబం నుండి ముగ్గురిని కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్నారు. అంతటి దుఃఖంలో ఉండి కూడా కృష్ణ మరణం రోజు మహేష్ బాబు చేసిన ఓ మంచి పనికి, మహేష్ ఉదారతకు, ఔన్నత్యానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కృష్ణ మరణం రోజు మహేష్ చేసిన మంచి పనిని వర్ణించడానికి కవులకు సైతం మాటలు చాలవు. వివరాల్లోకి వెళితే.. వెండితెరపైనే కాదు.. నిజజీవితంలోనూ మహేష్ మనసున్న శ్రీమంతుడే. గతంలో ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి తన ఉదారతను చాటుకున్న ఈ సూపర్ స్టార్.. తాజాగా మరో చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించి మానవత్వం చాటుకున్నాడు.
Advertisement
Read also: నా కూతురు పెళ్లికి మీరు రావొద్దు! సీఎంకి కాల్ చేసి చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ
Advertisement
ఒక పక్కన తన తండ్రి చావు బతుకులో ఆసుపత్రిలో ఉన్నా సరే మరో ప్రాణాన్ని బతికించేందుకు మహేష్, తన మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ప్రయత్నం చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురానికి చెందిన మోక్షిత్ సాయి అనే మూడేళ్ల బాబుకు గుండెల్లో రంధ్రం ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. దాంతో చిన్నారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. వారికి ఏం చేయాలో కూడా తోచలేదు. ఆ సమయంలో సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న మహేష్ బాబు ఫౌండేషన్ టీం వారిని కాంటాక్ట్ అయ్యారు. దీంతో వెంటనే వారు తమ బాబును తీసుకొని ఆంధ్ర హాస్పిటల్ కి వచ్చారు. పిల్లాడిని ఆసుపత్రికి తీసుకొని వారు వచ్చిన రోజే సూపర్ స్టార్ కృష్ణ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు.
ఈ విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులకు గుండె ఆగినంత పని అయింది. ఇలాంటి సమయంలో తమ పిల్లాడిని పట్టించుకుంటారో లేదో అని వారు భావించారు. కానీ పుట్టెడు దుఃఖంలో సైతం ఆ చిన్నారికి ఆపరేషన్ చేయించాడు మహేష్ బాబు. దాంతో ఆ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. అంతటి దుఃఖంలో కూడా సాయం చేసినందుకు ఆయన నిజంగా దేవుడు అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ వార్త తెలిసిన వారంతా ఆయనను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఈయన మంచి మనసుకు ఎప్పుడు మంచే జరగాలని అంతా ఆశిస్తున్నారు.
Also Read: ‘ఊర్వశివో రాక్షసివో’ ఓటిటి రిలీజ్! స్ట్రీమింగ్ ఎందులో కాబోతుందంటే..?