Advertisement
దాదాపు రెండున్నర రోజులపాటు మల్లారెడ్డి ఆస్తులకు సంబంధించి ఐటీ రెయిడ్స్ కొనసాగాయి. ఆయన ఇంటితోపాటు కుమారులు, అల్లుడు, విద్యాసంస్థలు ఇలా అనేక చోట్ల తనిఖీలు జరిగాయి. అయితే.. రెయిడ్స్ లో దొరికింది చాలా తక్కువ మొత్తమేనేని మల్లారెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కానీ, అధికారులు మాత్రం భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే కొన్ని కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు.
Advertisement
సోదాల్లో దాదాపు రూ.15 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. మల్లారెడ్డి వ్యాపార లావాదేవీలల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్లు గుర్తించినట్లు తెలిపాయి. మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, పీజీ సీట్ల విషయంలో విద్యార్ధుల నుంచి దాదాపు రూ.135 కోట్లు డొనేషన్ల కింద వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిబంధనలను తుంగలో తొక్కి కార్యకలాపాలు నిర్వహించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
Advertisement
ఐటీ సోదాల్లో భాగంగా మల్లారెడ్డితో పాటు 14 మందికి అధికారులు నోటీసులిచ్చారు. 28, 29 తేదీల్లో విచారణను ఎదుర్కోవాలని తెలిపారు. మల్లారెడ్డి సోదరులు, కుమారులు, అల్లుడుతో పాటు సన్నిహితులు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి నోటీసులు జారీ అయ్యాయి. ఆస్తుల లావాదేవీలతో పాటు ఆర్థిక లావాదేవీల వ్యవహారాలపై వీరందరిని అధికారులు విచారించనున్నారు. విద్యాసంస్థల్లో డొనేషన్లపై ప్రధానంగా ఆరా తీయనున్నట్లు సమాచారం.
మరోవైపు తాను ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని అంటున్నారు మల్లారెడ్డి. తమ దగ్గర దొరికింది కేవలం రూ.28 లక్షలేనని అన్నారు. రెయిడ్స్ తనకు కొత్త కాదని.. కేంద్ర బలగాలతో దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. ఐటీ అధికారులు తమను నమ్మించి మోసం చేశారని అన్నారు. తన కుమారుడిని మెంటల్ టార్చర్ పెట్టారని.. రూ.100 కోట్లు దొరికినట్లు బలవంతంగా సైన్ చేయించుకున్నారని ఆరోపించారు. ల్యాప్ టాప్ ను ఐటీ అధికారులు మర్చిపోతే వారికి తామే ఇచ్చామన్నారు. ఐటీ అధికారులు మల్లారెడ్డిపై కేసు పెట్టారు. తమపై దౌర్జన్యం చేశారని ల్యాప్ టాప్ లాక్కెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో మంత్రి అలా రియాక్ట్ అయ్యారు.