Advertisement
ఒక్క మ్యాచ్ లోనే ముగ్గురు పేసర్లు చెలరేగి ఆడడం అనేది టీం ఇండియా జట్టుకు సంబంధించి అద్భుతమైన విషయమే. ఇప్పటి వరకు టీం ఇండియా బ్యాటింగ్ పవర్, స్పిన్ బలంతోనే విజయాలు సాధించింది. ఈసారి వరల్డ్ కప్ పోరులో తన బౌలింగ్ సత్తాను కూడా చాటి చూపిస్తోంది. అయితే.. ఈ బౌలింగ్ వెనుక ఉన్న పవర్ మాన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్ లలో విజయం సాధించి అస్సలు ఓటమిని ఎరగని జట్టుగా నిలిచినా టీం ఇండియా ఈసారి బౌలింగ్ లో కూడా సత్తా చాటింది.
Advertisement
ఆస్ట్రేలియా, పాకిస్థాన్ లాంటి జట్లకు బ్యాటింగ్ పవర్ ఎక్కువ. ఇలాంటి జట్లను కూడా టీం ఇండియా బౌలింగ్ జట్టు 200 ల స్కోర్ ని దాటనివ్వలేదు. ఇంగ్లాండ్ ని 129 కి మరియు శ్రీలంకాని అయితే ఘోరంగా 55 పరుగులకే ఆల్ అవుట్ చేసేసారు. ఈసారి టీం ఇండియా బౌలింగ్ పవర్ చూసి ప్రపంచ జట్లు ఆశ్చర్యపోయాయి. అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన సౌత్ ఆఫ్రికాని కూడా 83 పరుగుల మార్క్ ని దాటనివ్వలేదు. మన దేశపు పిచ్ లపై స్పిన్ అనుకూలిస్తుంది.
Advertisement
అయినప్పటికీ టీం ఇండియాలో ముగ్గురు పేసర్లు ఉన్నారు. బుమ్రా, షమీ, సిరాజ్.. వీరు అద్భుతమైన పేస్ ఎటాక్ చేయగలరు. వీరు గంటకి 140 కిమీ పైగా వేగంతో బౌలింగ్ చేయగలరు. లైన్డ్ అండ్ లెంగ్త్, సిం అండ్ స్వింగ్ క్వాలిటీస్ ముగ్గురిలోనూ బాగానే ఉన్నాయి. గతం లో కూడా టీం ఇండియా జట్లలో అద్భుతమైన పేసర్లు ఉన్నారు. కానీ ఒకే సారి ముగ్గురు పేసర్లు టీం ఇండియాలో చెలరేగడం అనేది మొదటిసారి. అయితే దీనికి కారణం ముంబైకి చెందిన పరాస్ మాంబ్రే. ఆయన ముంబైలోనే 1972 జూన్ 20న జన్మించారు. చిన్నతనం నుంచి క్రికెట్ పిచ్చితో ఉన్న ఆయన పదిహేనేళ్ళు వచ్చాక ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చారు. క్రికెట్ పై ఉన్న పిచ్చితో, తండ్రికి చెప్పి.. సచిన్ కోచింగ్ తీసుకున్న అజయ్ మంజ్రేకర్ వద్దే ట్రైన్ అయ్యి సత్తా చాటారు. తన కెరీర్ లో 91 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు, 83 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడారు. మొత్తం 111 వికెట్లు తీశారు. టీం ఇండియాలోకి ఎంటర్ అయినా ఎక్కువ కాలం కొనసాగలేదు. 3 వన్డేలు, 2 టెస్టులు మాత్రమే టీం ఇండియా తరపున ఆడారు. ఆ తర్వాత ఆయన ఇండియా-ఏ టీమ్‌కు కోచ్‌గా పనిచేసారు. ప్రస్తుతం టీం ఇండియా జట్టుకు బౌలింగ్ కోచ్ గా ఎన్నిక అయ్యారు. ఆయన డైరెక్షన్ లోనే పేసర్లు అద్భుతంగ రాణిస్తున్నారు.
Read More:
పిల్లల ముందే బట్టలు చేంజ్ చేసుకోవడం లాంటి పనులు చేస్తున్నారా? అయితే ఇది కచ్చితంగా తెలుసుకోండి!
వివాహేతర సంబంధాలను పెట్టుకోవడానికి ముఖ్య కారణాలు ఏమిటి? ఇలా ఎందుకు చేస్తారంటే?