Advertisement
ఏపీలోని ఒంగోలుకు చెందిన ఓ బాలిక తను ప్రేమించిన వ్యక్తి కోసం హైదరాబాద్ కు వచ్చింది. కాగా, ప్రేమించిన ఆ యువకుడు ఆమెను సోమవారం రామచంద్రపురం పట్టణంలోని లింగంపల్లిలో వదిలేసి వెళ్లాడు. దీంతో ఆ బాలిక రోడ్డుపై రోదిస్తూ ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెకు ధైర్యం చెప్పారు.
Advertisement
READ ALSO :Dasara Movie Review: నాని “దసరా” మూవీ రివ్యూ & రేటింగ్.. హిట్ కొట్టినట్టేనా..?
నిజామాబాద్ ప్రాంతానికి చెందిన యువకుడు ప్రస్తుతం పటాన్ చెరువులో సెంట్రింగ్ కార్మికుడిగా పని చేస్తున్నాడని, అతని కోసం ఇక్కడికి వచ్చానని వివరించింది. అతడి ఫోన్ నెంబర్ కూడా తన వద్ద లేదని సీఐ సంజయ్ కు చెప్పగా స్టేట్ హోమ్ కు తరలించారు. ఇది ఇలా ఉండగా ఉద్యోగం పోయిందని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహ** చేసుకున్నాడు. ఆమిన్ పూర్ పోలీసుల కథనం ప్రకారం,
Advertisement
సాయి విల్లాస్ లో నివాసం ఉండే హరీష్ (30) ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. అయితే ఇటీవల హరీష్ ఉద్యోగం పోయింది. దీంతో తీవ్ర మనస్థపం చెందాడు. ఆదివారం భార్య నందిని బయటకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న హరీష్ చీరతో ఫ్యాన్ కు ఉరి వేసుకునే ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఇంటికి రాగా ఉరి వేసుకున్న భర్త కనిపించాడు. స్థానికుల సాయంతో భర్తను మదీనాగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడు హరీష్ సోదరుడు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
READ ALSO : రాజమౌళి సినిమాల్లో “ఛత్రపతి శేఖర్” తప్పకుండా ఉండాల్సిందేనట ఎందుకంటే ?