Advertisement
ఈ రోజుల్లో చాలామంది పెళ్లి చేసుకోవడం తర్వాత మోసపోవడం.. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవడం.. విడిపోవడం వంటివే జరుగుతున్నాయి. ఈ రోజుల్లో మ్యాట్రిమోనీ సైట్ల ద్వారానే పెళ్లి సంబంధాలను వెతుక్కుంటున్నారు. కానీ నిజానికి మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా పెళ్లి సంబంధాలుని వెతుక్కుని చాలామంది మోసపోతున్నారు. ఎందుకంటే మ్యాట్రిమోనీ సైట్లలో కొన్ని మాత్రమే జెన్యూన్ గా ఉంటున్నాయి. నకిలీవే ఎక్కువగా కనబడుతున్నాయి. తప్పుడు ప్రచారం, తప్పుడు సమాచారం ఇచ్చి పెళ్లిళ్లు చేసుకోవడం, ఆ తర్వాత దొరికిన కాటికి దోచుకుని వెళ్లిపోవడం వంటివే ఎక్కువ జరుగుతున్నాయి.
Advertisement
ఒక మ్యాట్రిమోనీ సైట్ ద్వారా ఒకతను పెళ్లి చేసుకుని, ఆఖరికి షాక్ అయిపోయాడు. ఆమె ఒక వాంటెడ్ క్రిమినల్ అని తెలిసి ఆశ్చర్యపోయాడు. గుజరాత్ లో ఇది చోటుచేసుకుంది. గుజరాత్ కి చెందిన విమల్ మ్యాట్రిమోనీ సైట్ ద్వారా రీతా అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఫోన్లు మాట్లాడుకుంటూ ఉండేవారు. తర్వాత పెళ్లి అయింది. ఇదివరకే ఆమెకి పెళ్లయిందని భర్తతో విడాకులు తీసుకున్నానని ఆమె అతనితో చెప్పింది అయితే విడాకులు పేపర్లు తీసుకురమ్మని అతను చెప్పాడు.
Advertisement
గ్రామపంచాయతీలో పెళ్లయిందని అని చెప్పి తప్పించేసుకుంది. అతను కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇద్దరూ కూడా అహ్మదాబాద్ కి వెళ్లి పెళ్లి చేసుకున్నారు అక్కడ అప్పటినుండి కూడా వాళ్ళిద్దరూ అక్కడే ఉంటున్నారు. పెళ్లయిన 6 నెలల తర్వాత రీతా అస్సాం కి వెళ్ళింది ఏవో స్థలం గొడవలని విమల్ కి చెప్పింది. ఆమె వెళ్ళాక విమల్ కి ఫోన్ వచ్చింది. అయితే రీతా ఒక కేసులో ఇరుక్కుందని నేను ఆమె లాయర్ ని ఒక అతను చెప్పాడు.
ఆమెని విడిపించాలంటే లక్ష రూపాయలు కావాలన్నాడు. విమల్ లక్ష రూపాయలు కట్టేసాడు. కోర్టు పేపర్లు చదివాక అనుమానం వచ్చింది. అందులో ఆమె పేరు చౌహాన్ అని ఉంది దీంతో అతను షాక్ అయ్యాడు. ఫోన్ చేసి భార్యని అడిగాడు. కానీ అతని మాట దాటేసి ఆమె అతన్ని బ్లాక్ చేసేసింది. గూగుల్ లో ఆమె పేరుని వెతికాడు. ఇక అంతే షాక్ అయిపోయాడు. దొంగతనం హత్య మొదలైన నేరాల్లో నిందితురాలని తెలుసుకున్నాడు. ఇదివరకే ఆమెకి అనిల్ చౌహాన్ తో పెళ్లి అయింది ఇద్దరూ దాదాపు 6000 కార్లను దొంగతనం చేశారు.
Also read: