Advertisement
Mansion 24 webseries OTT Platform, Review: హారర్ సినిమాల గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. హారర్ సినిమాలు తీయడం ఆర్ట్. ఇండియాలో చాలా తక్కువ మంది దర్శకులు అందులో పట్టు సాధించారు. ముఖ్యంగా తమిళంలో ‘కాంచన’ ఫ్రాంచైజీతో రాఘవ లారెన్స్, తెలుగులో ‘రాజుగారిగది’ ఫ్రాంచైజీతో ఓంకార్ విజయాలు సాధించారు. భయంతో కూడిన వినోదాన్ని ప్రేక్షకులకు అందించారు.
Advertisement
Read More: What The Fish Movie: OTT Release Date, Digital rights and Satellite rights Details
హారర్ చిత్రాలతో సిల్వర్ స్క్రీన్ మీద విజయాలు అందుకున్న ఓంకార్ ఇప్పుడు ‘మ్యాన్షన్ 24’ వెబ్ సిరీస్ తో ఓటీటీలో అడుగుపెట్టారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులో ఉంది. ‘మ్యాన్షన్ 24’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది.
Advertisement
Mansion 24 OTT Plaform
అలాగే బిగ్ బాస్ ఫెమ్ బిందుమాధవి, సత్యరాజ్, అవికాగోర్, అభినయ, రాజీవ్ కనకాల, అనిష్ కురువిల్ల, మానస్, అమర్దీప్ చౌదరి, అయ్యప్ప చౌదరి, విధుల్లేఖ రామన్, మీనా కుమారి, రావు రమేష్…. ఇలా తెలుగు, తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటీనటులు ఈ హారర్ వెబ్ సిరీస్ లో నటించారు.
పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ లతో ఆసక్తిని రేకెత్తించిన ‘మ్యాన్షన్ 24’ వెబ్ సిరీస్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీప్లస్ హాట్ స్టార్ లో మంగళవారం నుంచి అంటే ఇవాళ్టి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు తమిళ్ లోనూ ‘మ్యాన్షన్ 24’ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది.