Advertisement
ఇండియాలో మేనరికం పెళ్లిళ్లు విపరీతంగా జరుగుతాయి. పూర్వ కాలం నుంచే మేనరికం పెళ్లళ్ల ఆచారం కొనసాగుతోంది. అయితే.. మేనరికం పెళ్లి కారణంగా వచ్చే కష్టాలు చాలా ఉంటాయి. ఎందుకంటే మేనరికం పెళ్లిళ్లలో ఆ కుటుంబానికి సంబంధించిన వ్యాధులు ఏమైనా షుగర్, రక్తసంబంధిత వ్యాధులు కావచ్చు. తరతరాలుగా వచ్చే తలసేమియా వ్యాధులు కావచ్చు. ఇలా ఎన్నో రకాల వ్యాధులు కావచ్చు. అదే కుటుంబంలో సభ్యులు మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోవడం వలన వాళ్ళ కుటుంబీకులకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మేనరికం పెళ్లిళ్లలో కూడా ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ కూడా ఉంటాయి. అంటే వెంట వెంటనే పెళ్లి చేసుకుంటే అదే కుటుంబంలో మేనమామను చేసుకుంటే, సెకండ్ జనరేషన్ అంటారు. బావను చేసుకుంటే ఫస్ట్ జనరేషన్ అంటారు.
Advertisement
Also Read: వరమహాలక్ష్మి వ్రతాన్ని ఎందుకు ఆచరించాలి? దాని వెనుక ఉన్న కథ ఏంటి ?
దానివలన కూడా వేరే పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే మన జన్యుపరంగా, క్రోమోజోము పరంగా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఆ ఫ్యామిలీలో మళ్లీ మళ్లీ పెళ్లి చేసుకోవడం వలన అదే ఫ్యామిలీలో ఆ క్రోమోజోమ్స్ అనేది మళ్లీ అదే ఫ్యామిలీకి రెండు లేక మూడు సెట్లు లాగా వచ్చేస్తాయి. దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్లకు ఉన్న వ్యాధులు ఏమైతే ఉంటాయో వాటి తీవ్రత పెరగడం, తల్లిదండ్రులకు లేని వ్యాధులు కూడా పుట్టే పిల్లలకు రావచ్చు. అలా కాకుండా బయట ఫ్యామిలీలో వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ వ్యాధి అనేది తగ్గిపోవడం లేదా వెళ్లిపోవడం వంటివి జరుగుతాయి.
Advertisement
Also Read: విమానాల్లో ప్రయాణం చేసేప్పుడు అస్సలు చెప్పకూడని ఈ 7 పదాలు..! చెప్పారంటే జైలు శిక్షే !
అందువలన మన ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా వ్యాధులు ఉంటే, ఆ ఫ్యామిలీలో వ్యక్తులను పెళ్లి చేసుకోకపోతే పిల్లలకు వ్యాధులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ తప్పని పరిస్థితులలో వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సి వస్తే ముందుగా జెనెటిక్ కౌన్సిలర్ ను సంప్రదిస్తే డీటెయిల్ క్రోమోజోముల ఎనాలసిస్ చేసుకోవాలి. వాటి యొక్క ప్రతి బ్రాంచ్ క్రోమోజోములు సూక్ష్మంగా పరిశీలించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అని వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది. మీరు పెళ్లి చేసుకునే వాళ్లకు కూడా సేమ్ టెస్టులు చేయించి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. వాళ్ళు నెక్స్ట్ బేబీకి వచ్చే ఛాన్స్ ఎంత ఉందో చెబుతారు. అయినా మీకు ప్రాబ్లమ్ గా ఉంటే మీ జెనెటిక్ కౌన్సిలర్లను సంప్రదించి హయ్యర్ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్, తీసుకుంటే కచ్చితంగా మీ సమస్యకు ఒక పరిష్కారం అంటూ ఉంటుంది.
READ ALSO : కేక్ లో విషం పెట్టి… చిరంజీవిని చంపాలని చూసింది ఎవరు?