Advertisement
స్టార్ నటుడు అర్జున్ దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్ దాస్.. తొలిసారిగా నటించిన మూవీ కార్తి హీరోగా వచ్చిన ఖైదీ. తర్వాత విజయ్ మాస్టర్ సినిమాలో సైతం మంచి పాత్రలో నటించాడు. ఇండస్ట్రీకి వచ్చి అతి తక్కువ రోజుల్లోనే ఇంత పాపులర్ అవడం వెనుక అర్జున్ దాస్ శ్రమ ఏంటి? అతను ఎవరు? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నంలో, చెన్నైలో జన్మించిన అర్జున్ చిన్నతనం నుంచి చదువులో ముందుండేవాడు.
Advertisement
అలాగే నటన అంటే కూడా మహా ఇష్టం. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తాను ముందు లైఫ్ లో సెటిల్ అవ్వాలని అనుకున్నాడు. అందుకే దుబాయ్ లో బ్యాంకు ఉద్యోగం సాధించి లక్షల్లో జీతం సంపాదించడం మొదలుపెట్టాడు. అన్ని పరిస్థితులు చక్కబెట్టాక మళ్ళీ తాను నటుడు అవ్వాలనే కలను నెరవేర్చుకునే పనిలో పడ్డాడు. అందుకే ఉద్యోగం మానేసి మళ్లీ చెన్నైకి వచ్చి చేరుకున్నాడు. అయితే చెన్నైకి వచ్చాక అతను బాగా బరువు పెరిగాడు. అయితే సినిమాల్లో నటించాలంటే ఇంత బరువు ఉండకూడదు, అనుకోని ఏకంగా 32 కేజీలు తగ్గాడు.
Advertisement
ఇక మొట్టమొదటిగా పేరుమాన్ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాలో మెయిన్ రోల్ లో నటించిన కూడా అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే అనుకోకుండా ఖాళీగా ఉన్న సమయంలో ఒక షార్ట్ ఫిలింలో నటించాడు. ఆ షార్ట్ ఫిలింలో నటనకు గాను అతనికి మంచి పేరుతో పాటు, కార్తీతో ఖైదీ సినిమాలో విలన్ గా నటించే అవకాశం దక్కింది. తోలుత నటించడానికి ఆలోచించినా, ఆ తర్వాత ఓకే అన్నాడు. ఖైదీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత అర్జున్ దాస్ ఎప్పుడు వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రజలకు కూడా పరిచయమయ్యాడు అర్జున్.
also read:రిలయన్స్ అధినేత అంబానీ ఆస్తుల్లో విలాసవంతమైన వస్తువులు ఇవే