Advertisement
Mathu Vadalara 2 Review and Rating: శ్రీ సింహ కోడూరి, సత్య, సునీల్, వెన్నెల కిషోర్, ఫారియా అబ్దుల్లా ఈ మూవీలో నటించారు. రితేష్ రానా దర్శకత్వం వహించారు. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ అందించగా, కాల భైరవ సంగీతాన్ని అందించారు.
Advertisement
సినిమా: మత్తువదలరా 2
దర్శకత్వం: రితేష్ రానా
నటులు: శ్రీ సింహ కోడూరి, సత్య, సునీల్, వెన్నెల కిషోర్, ఫారియా అబ్దుల్లా
సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం
సంగీతం: కాల భైరవ
విడుదల తేదీ: 13 సెప్టెంబర్ 2024
కథ మరియు వివరణ:
కథ గురించి చూస్తే.. సురేష్ ఇంకా సత్య ఇద్దరు కలిసి మొదటి పార్ట్ లో ఎలా అయితే దొంగతనాలు చేస్తారో సెకండ్ పార్ట్ లో కూడా అదే కంటిన్యూ చేస్తారు. ఒక పెద్ద దొంగతనం చేసి లైఫ్ సెట్ చేసుకోవాలని చూస్తారు. అందులో భాగంగా దొంగతనం సక్సెస్ ఫుల్ గా జరిగిందా లేదా..? ఇక ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి మధ్య ఇంటర్ లింక్ ఏంటి అనే దాని గురించి తెలియాలంటే సినిమా చూడాలి. సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా రితేష్ రానా అద్భుతంగా తీసుకువచ్చారు. చాలా వరకు సక్సెస్ అయ్యారు అని చెప్పొచ్చు. కామెడీ సీన్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. మొదట్లో కొంచెం డల్ గా అనిపించినా సినిమా నడిచే కొద్దీ దూసుకు వెళ్ళిపోయింది.
Advertisement
సత్య మీద రాసిన కామెడీ సీన్లు అందరినీ నవ్వించాయి. హ్యాపీ న్యూ ఇయర్ సినిమా ఫ్లాప్ అవడంతో ఎలా అయినా ఈ సినిమా సక్సెస్ సాధించాలని ఫోకస్ ఎక్కువగా పెట్టారు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కామెడీ అద్భుతంగా ఉంది. క్లైమాక్స్ లో మాత్రం సినిమాని చాలా హై రేంజ్ లోకి తీసుకెళ్లారు. శ్రీ సింహ ఈ సినిమాలో చాలా అద్భుతంగా సెట్ అయ్యారు దర్శకుడు ఎంచుకున్న పాయింట్ చాలా బాగుంది. క్లియర్ కట్ గా ఉంది. సినిమాలో మ్యూజిక్ కూడా చాలా కీలకపాత్ర వహించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సెకండ్ హాఫ్ లో చాలా అద్భుతంగా ఉంది.
ఆర్టిస్టులు కూడా పాత్రలకు తగ్గట్టు అద్భుతంగా నటించారు. హీరోయిన్ ఫరియా కూడా తన పాత్రకు తగ్గట్టు బాగా నటించింది. టెక్నికల్ అంశాలు గురించి చూస్తే.. మ్యూజిక్ అదిరిపోయింది. దర్శకుడు ఏ టెంపోలో అయితే సినిమాని ముందుకు తీసుకెళ్లాడో ఆ టెంపోని మ్యాచ్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ స్కోరు సినిమాకు ఇవ్వడం ప్లస్ అయింది.
ప్లస్ పాయింట్స్
సత్య కామెడీ
మ్యూజిక్
స్టోరీ
మైనస్ పాయింట్స్
కొంచెం బోర్ కొట్టడం
హీరో క్యారెక్టర్జేషన్ ని డెప్త్ గా చూపించకపోవడం
రేటింగ్: 2.25/5
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!