Advertisement
ఏదైనా సినిమా తెరమీదకి రావాలంటే కథ, అందుకు తగ్గట్టుగా కథనం, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఇలా అన్నీ కూడా చక్కగా కుదరాలి. అప్పుడే సినిమా బాగుంటుంది లేదంటే సినిమా ఫ్లాప్ అవ్వడం లేదంటే సినిమాను చూడడానికి ఆడియన్స్ లో ఆసక్తి లేకపోవడం వంటివి చోటు చేసుకుంటాయి. ఒక సినిమాను నిర్మించే నిర్మాణ సంస్థ అంతకన్నా మంచి పేరును కలిగి ఉంటే అది త్వరగా జనాలలోకి వెళ్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని ఎంతో ఆలోచించి పేరుపెట్టిన ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయి. వాటి అర్థం తెలియకపోయినా ఎప్పుడు వాటి గురించి మాట్లాడుకుంటుంటారు. అలా అర్థం ఉన్న పేర్లు కలిగిన నిర్మాణ సంస్థలు ఏంటి? ఆ ఎవరి నిర్మాణ సాధ్యంలో నడుస్తున్నాయి అనేది తెలుసుకుందాం.
Advertisement
వైజయంతి మూవీస్:
అశ్విని దత్ ప్రారంభించిన నిర్మాణ సంస్థ ఇది. వైజయంతి అనే పేరు ఎవరిది అసలు ఈ పేరు ఎందుకు పెట్టారు అనేది చూస్తే.. అశ్విని దత్ ప్రొడక్షన్ హౌస్ కి ఎన్టీఆర్ గారిని పేరు పెట్టమని అడిగారట. దాంతో ఎప్పుడూ వాడిపోయినటువంటి కృష్ణుని మెడలో ఉన్న వైజయంతి మాల పేరు నుంచి వైజయంతిని తీసుకువచ్చి ఈ పేరును సూచించారు. ఇలా ఇది స్టార్ట్ అయింది.
Advertisement
Also read:
గీతా ఆర్ట్స్ :
చాలామంది గీత ఆర్ట్స్ అంటే అల్లు అరవింద్ భార్య పేరు గీత అనుకుంటారు కానీ గీతా అంటే భగవద్గీత నుండి తీసుకున్న పేరు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ గీత సారాంశం ఏమిటి అంటే మనం చేసే పని చేయాలి. కానీ దాని ఫలితంగా ఆశించకూడదు అని అలా ఈ పేరుని పెట్టారు.
హోంబలే ఫిలిమ్స్:
పునీత్ రాజ్ కుమార్ ఈ పేరుని తన స్నేహితుడికి సూచించడంతో ఈ పేరుని పెట్టారు. కర్ణాటకలో ఎంతో ఫేమస్ అయిన హోమ్ బలం అనే ఒక దేవత పేరు ఇది.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!