Advertisement
ప్రముఖ నటి మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది మీనా. స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈమె కొద్ది రోజులపాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఆ తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. బుల్లితెరపై కూడా పలు షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అయితే యుక్త వయసులోనే మీనా తన భర్త విద్యాసాగర్ ను కోల్పోవడం చాలా బాధాకరమని చెప్పాలి.
Advertisement
Read also: బాలయ్య కూతురు బ్రహ్మణి గురించి ఎవరికీ షాకింగ్ నిజాలు ఇవే !
Advertisement
కరోనా కారణంగా ఆయన ఆరోగ్యం తీవ్రంగా చెడిపోయినట్లు అప్పట్లో పేర్కొన్నారు. పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ తో ఆయన చనిపోయినట్లుగా ప్రకటించారు. తన భర్త మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న మీనా ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకుంటుంది. ఈ తరుణంలో మీనా వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ!. ఫ్యామిలీ క్లోజ్ ఫ్రెండ్ అయిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి మీనా సిద్దపడిందని, మీనా కి రెండో పెళ్లి ఇష్టం లేదని, కానీ తన కుమార్తె నైనికాను దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు రెండో పెళ్లికి ఒప్పుకున్నారని వార్తలు హల్చల్ చేశాయి.
అయితే ఈ పుకార్లు వెలువడ్డ సమయంలోనే మీనా సన్నిహిత వర్గాలు వీటిని కొట్టి పడేసాయి. ఈ పుకార్లపై తాజాగా మీనా స్పందించింది. తనపై వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించింది. తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టం చేసింది. తన భర్త చనిపోయినప్పుడు కూడా అసత్యాలను ప్రచారం చేశారని, ఆ బాధ నుంచి తేరుకోకముందే వివాహం ఎలా చేసుకుంటానని పేర్కొంది. ఇక ప్రస్తుతం కథలను వింటున్నానని.. త్వరలోనే షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు తెలిపింది.
Read also: యాదమ్మ రాజుకి కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?