Advertisement
మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. చిరంజీవి నట ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఎటువంటి సినిమా నేపథ్యం లేని చిరంజీవి స్వయంకృషి, పట్టుదలతో స్టార్ హీరోగా మారారు. కెరీర్ ప్రారంభంలో చిరంజీవి సపోర్టింగ్ విలన్ రోల్స్ చేశారు. స్టార్ హీరో కావాలంటే మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని ఆయన భావించారు. బెస్ట్ డాన్సర్ గా పేరు తెచ్చుకున్నారు. భరతనాట్యంలో శిక్షణ తీసుకున్న చిరంజీవికి మోడ్రన్ డాన్సులు చాలా ఈజీ అయింది.
Advertisement
డాన్స్ లో చిరంజీవి ట్రెండ్ సెట్టర్ అయ్యారు. చిరంజీవికే ముందు ప్రొఫెషనల్ గా డాన్స్ చేసే హీరోలు ఎవరూ కూడా లేరు. చిరంజీవి కెరీర్ ని ఖైదీ ముందు ఆ తర్వాత అని చెప్పవచ్చు. ఖైదీ మూవీ తో చిరంజీవికి స్టార్ డం వచ్చింది. అక్కడి నుంచి చిరంజీవి అస్సలు తిరిగి చూసుకోలేదు. దేశంలో కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న మొదటి హీరో చిరు చిరంజీవి. 1992లోనే కోటి రూపాయలు తీసుకున్నారు. అప్పటికి అమితాబచ్చన్ రెమ్యూనిరేషన్ కూడా అంత లేదు. 150 కి పైగా సినిమాల్లో చిరు నటించిన నాలుగు సినిమాలు విడుదలయ్యాయి.
Advertisement
Also read:
ప్రస్తుతం చిరంజీవి సినిమాకు 40, 50 కోట్ల వరకు తీసుకుంటున్నారు. చిరంజీవి ఆస్తులు వివరాలు చూస్తే జూబ్లీహిల్స్ లో చిరంజీవికి లగ్జరీ హౌస్ ఉంది అత్యాధునిక హంగులతో విశాలంగా నిర్మించిన ఈ హౌస్ ని ముప్పై కోట్లతో నిర్మించారు దాని ప్రస్తుతం మార్కెట్ విలువ 50 కోట్లకు పైనే ఉంది. బెంగళూరులో ఒక ఫామ్ హౌస్ ఉంది చెన్నైలో ఖరీదైన ప్రదేశాల్లో ఇల్లులు ఉన్నాయి. లగ్జరీ కార్ల కలెక్షన్ కూడా ఉంది. రోల్స్ రాయిస్ చాలా ప్రత్యేకమైనది. ఆడి, బెంజ్, రేంజ్ రోవర్, టయోటా ఇలా పలు కార్లు ఆయనకి ఉన్నాయి. చార్టెడ్ ఫ్లైట్ కూడా చిరంజీవికి ఉంది.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!