Advertisement
ఈరోజుల్లో ఆడపిల్లలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఆడపిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. సమాజంలో నేటికీ ఆడపిల్లలని చులకనగా చూసేవారు కూడా ఉన్నారు. ఎన్నో అవమానాలు ఎదురైనా కూడా సక్సెస్ ని ఎదుర్కొని మంచి పోజిషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కెరియర్ లో ఎన్నో కష్టాల్ని అవమానాలను ఎదుర్కొని సక్సెస్ అందుకున్న యువతుల్లో మేఘన కూడా ఒకరు. బాల్యంలో మేఘన ఆదివాసీల సమస్యల్ని ప్రత్యక్షంగా చూశారు తాను న్యాయవృత్తిని ఎంచుకుంటే వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలని భావించారు. ఎంతో కష్టపడి న్యాయమూర్తి అయిన గడ్డం మేఘన సక్సెస్ స్టోరీ చూద్దాం.
Advertisement
మంచిర్యాల జిల్లాలోని దేవాపూర్ గ్రామంలో గడ్డం మేఘన పుట్టారు. తల్లిదండ్రులకి మేఘన ఒక్కరే కూతురు. ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులు భావించారు మేఘనని తల్లిదండ్రులు చదివిస్తుంటే ఇరుగుపొరుగు వాళ్ళు ఇష్టానుసారంగా నానా మాటలు అనేవారు. పదవ తరగతిలో ఆమెకి 9.8 వచ్చాయి. కరీంనగర్ లోని ప్రముఖ కాలేజీలో ఎల్ఎల్బి ప్రవేశ పరీక్షల్లో 84వ ర్యాంకు వచ్చింది. 14 గంటల ప్రిపరేషన్తో మేఘన సివిల్స్ జడ్జిగా లక్ష్యాన్ని సాధించారు.
Advertisement
Also read:
Also read:
పేదలకు న్యాయం అందే విధంగా ఆమె కృషి చేస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరిస్తానని ఆమె చెప్తున్నారు. ఆడపిల్లలకి చదివి ఎందుకని విమర్శలు చేసిన వాళ్ళు నోరు మూయించారు మేఘన. ఎంతో మందికి ఇప్పుడు స్ఫూర్తిగా నిలిచారు. ఈమె సక్సెస్ ని చూసి అందరూ శభాష్ అంటున్నారు. మేఘన ఒక్కో మెట్టు పైకి ఎదిగి ప్రశంసల్ని అందుకుంటున్నారు. అబ్బాయి అమ్మాయి అని తేడా లేకుండా పిల్లల్ని చదివిస్తే తక్కువ సమయంలోనే సక్సెస్ అవుతారని మంచి పొజిషన్ లోకి వస్తారని మేఘన ని చూస్తే తెలుస్తోంది. యూత్ మేఘన ని ఆదర్శంగా తీసుకుంటే ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!