Advertisement
మానసికంగా దృఢంగా ఉండడం జీవితంలో చాలా ముఖ్యమైనది. మన ఆనందం మన ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం. మనం ఆనందంగా ఉన్నామా బాధగా ఉన్నామా అనేది పూర్తిగా మనమే నియంత్రణలో ఉంటుందని చాలా మంది చెప్పారు. ఏం జరగబోతోంది ఏం సాధించారు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా అతీతమైనవి అని, మెదడు మీరు ఆనందంగా ఉన్నారా లేదంటే బాధగా ఉన్నారా అనేది డిసైడ్ చేస్తుందని ఎందరో మహానుభావులు అనాన్రు. అలానే మెదడును నియంత్రణలో ఉంచుకుంటే మానసికంగా మిమ్మల్ని మీరు మలుచుకుంటే మీకు మించిన వాళ్ళు ఇంకెవరూ ఉండరు.
Advertisement
మానసికంగా దృఢంగా ఉన్నారో లేదో ఎలా తెలుసుకోవచ్చు..? మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తుల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అన్నది చూద్దాం. మీ బలాలు ఏంటి, మీ బలహీనతలు ఏంటి అనేది అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యం. మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తుల్లో ఇది స్పష్టంగా ఉంటుంది. అలానే మీరేంటో మీకు తెలిస్తే మీ పరిధిలో సరిహద్దులు ఏంటో అర్థం అవుతాయి. మీ గురించి మీకు అవగాహన ఉండాలి. క్లారిటీతో ఉండాలి.
Advertisement
ఏం చేయాలనుకుంటున్నారో దానిపై కచ్చితంగా మీకు ఒక క్లారిటీ ఉండాలి. అలానే పర్సనల్ గ్రోత్ మీద దృష్టి పెట్టడం కూడా చాలా అవసరం. అలానే మీ మీద మీకు ప్రేమ ఉండాలి. సెల్ఫ్ లవ్ అనేది చాలా ముఖ్యం. మీకోసం మీరు కాస్త సమయాన్ని కేటాయించండి. సెల్ఫ్ లవ్ అనేది మానసికంగా దృఢంగా ఉన్న వారి అలవాట్లలో ఒకటి. మానసికంగా దృఢంగా ఉన్న వారు ఓటమి నుండి పాఠాలను నేర్చుకుంటారు. మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తులు ఎమోషన్స్ ని కూడా కంట్రోల్ చేసుకోగలుగుతారు. కృతజ్ఞతా భావాన్ని కూడా వారు కలిగి ఉంటారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!