Advertisement
రాజకీయాల్లో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అవడం కామనైపోయింది. ఉదయం ఓ పార్టీలో ఉన్న నేత..సాయంత్రానికి మరో కండువా కప్పేసుకుంటున్నాడు. కానీ, కొంతమంది లీడర్లు మాత్రం పార్టీనే నమ్ముకుని జీవిస్తుంటారు. కష్టమైనా, సుఖమైనా పార్టీతోనే కలిసి బతుకుతుంటారు. అహర్నిశలు శ్రమిస్తుంటారు. అలాంటి వారిలో జగన్నాథం ఒకరని బీజేపీ నేతలు ఆకాశానికెత్తేస్తున్నారు.
Advertisement
మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు టీఆర్ఎస్ కు చాలా ముఖ్యం. అయితే.. ఎలాగైనా విజయం సాధించాలని గులాబీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అలా.. నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత జగన్నాథానికి మంత్రి కేటీఆర్ ఫోన్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకొచ్చింది. మునుగోడులో టీఆర్ఎస్ కు సహకరించాలని కోరారు. దానికి కారణం లేకపోలేదు. గట్టుప్పల్ లో జగన్నాథానికి మంచి పేరు ఉంది. అందుకే కేటీఆర్ గాలం వేసేందుకు చూశారు.
Advertisement
అయితే.. కేటీఆర్ రిక్వెస్ట్ ను రిజెక్ట్ చేసిన జగన్నాథం.. పార్టీకి మోసం చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీజేపీకి ద్రోహం చేయనని ముందు.. మీరు రైతుబంధు వందల ఎకరాలున్న భూస్వాములకు కాదు.. కౌలు రైతులకు, నిజమైన రైతులకు ఇవ్వండని కౌంటర్ ఇచ్చారు. జగన్నాథం గురించి తెలుసుకుని బీజేపీ నాయకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బీజేపీ లీడర్లను కొనడానికి మంత్రులు ప్రయత్నిస్తున్నారనటానికి ఇదే నిదర్శనమని మండిపడుతున్నారు.
మునుగోడు ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అరవింద్.. జగన్నాథంతో సెల్ఫీ దిగారు. ఆ ఫొటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోతో పాటు కీలక వ్యాఖ్యలను జోడించారు. ‘‘పార్టీ నన్ను, జగన్నాథం అన్నతో కలిసి బ్రహ్మాండంగా పనిచేయమని చెప్పింది. గట్టుప్పల్ ఇంఛార్జిగా నన్ను నియమించింది. జగన్నాథం అన్నగారితో కలిసి పని చేసి… మునుగోడులో బీజేపీ జెండాను ఎగరేస్తం’’ అని ట్వీట్ చేశారు అరవింద్.