Advertisement
మల్లారెడ్డి ఐటీ సోదాల ఇష్యూలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొదట 16 మందికి నోటీసులు ఇచ్చిన అధికారులు వారిలో 12 మందిని విచారణ చేశారు. ఈ క్రమంలోనే మరో పదిమందికి సమన్లు జారీ అయ్యాయి. వారు విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపారు. మొదటి రోజు విచారణలో సేకరించిన సమాచారం ఆధారంగా 10మందికి సమన్లు వెళ్లాయి.
Advertisement
డిసెంబర్ 5 వరకు ఈ విచారణలు కొనసాగే అవకాశం ఉంది. చాలామందిని విచారించాల్సి ఉండడంతో అధికారులు అంత టైమ్ పడుతుందని అంటున్నారు. విచారణలో ప్రధానం మెడికల్ సీట్ల కేటాయింపుపైనే దృష్టి సారించారు. మొదటిరోజు మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డిని ఐటీ అధికారులు ప్రశ్నించారు. తమకున్న అన్ని డౌట్స్ ను క్లియర్ చేసుకునేందుకు ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ అనంతరం భద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాము అన్ని వివరాలు వెల్లడించామని చెప్పారు.
Advertisement
అవసరమనుకుంటే మరోసారి విచారణకు పిలుస్తామని చెప్పారని.. తమ సైడ్ నుంచి అన్ని క్లియర్ గా ఉన్నాయని అన్నారు. ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల ఫీజుల వివరాలు సీట్ల కేటాయింపు వివరాలను సమర్పించాలని అధికారులు కోరారని వెల్లడించారు. వారు చెప్పిన ఫార్మెట్ లోనే అందించామని చెప్పారు. విచారణకు తాము అన్ని విధాలా సహకరిస్తామన్నారు భద్రారెడ్డి. ఇక మంత్రి మల్లారెడ్డి తరుఫున రెండోరోజు విచారణకు ఆయన ఆడిటర్ హాజరు కానున్నారు.
భద్రారెడ్డి, రాజశేఖర్ రెడ్డితోపాటు కళాశాలల ప్రిన్సిపాల్స్, మరికొంత సిబ్బందిని అధికారులు విచారించారు. సిబ్బంది స్టేట్మెంట్లను అధికారులు రికార్డు చేశారు. ఈ నెల 30న మరోసారి విచారణకు రావాలని నరసింహారెడ్డి, త్రిశూల్ రెడ్డికి ఐటీ అధికారులు చెప్పారు. కానీ, వారు మాత్రం తమను ఎలాంటి ప్రశ్నలు ఐటీ అధికారులు అడగలేదంటున్నారు. ఆర్థిక లావాదేవీలు, కాలేజీ విషయాలు అడగలేదని.. 30న విచారణకు హాజరవుతామని తెలిపారు.