Advertisement
బోయపాటి డైరెక్షన్ లో రామ్ పోతినేని హీరోగా స్కంద సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ఈరోజు విడుదల అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాలలోను రికార్డు స్థాయి థియేటర్లలో ఈ సినిమా విడుదల అయ్యింది. విడుదల అయిన మొదటి రోజే స్కంద సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమాలో ఓ మైనస్ కూడా ఉంది. అదేంటో ఈ ఆర్టికల్ చదివి తెలుసుకుందాం.
Advertisement
ఇవి కూడా చదవండి: Chandramukhi Review: మొదటి పార్ట్ కంటే ”చంద్రముఖి 2” బాగుందా..? కథ, రివ్యూ అండ్ రేటింగ్…!
ఇవి కూడా చదవండి: Skanda Review and Rating in Telugu: స్కంద సినిమాతో రామ్ హిట్ కొట్టేశాడా..? కథ, రివ్యూ & రేటింగ్…!
Advertisement
స్కంద సినిమాను కూడా బోయపాటి అఖండ రేంజ్ లో తీర్చిదిద్దారు అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా ఫీస్ట్ లాంటిది. రామ్ ఫాన్స్ కి పండగ లాంటి సినిమా ఇది. బోయపాటి డైరెక్షన్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గాని, ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అటు మాస్ ఆడియన్స్ ను, ఇటు రామ్ ఫాన్స్ ను ఈ సినిమా అస్సలు డిజప్పోయింట్ చెయ్యదు.
ఇవి కూడా చదవండి: బంగాళాదుంప చిప్స్ ని కనిపెట్టింది ఎవరో తెలుసా? అసలు వీటి స్టోరీ ఏంటంటే?
అయితే చిన్న చిన్న మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సినిమా సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా లాగ్ అనిపిస్తుంది. ఫైట్ సీన్స్ మాస్ ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసినప్పటికీ కథలో ఎక్కడో ఎదో లోపించినట్లు అనిపిస్తుంది. కథ కొత్తదేమీ కాదు. అయినా ఆకట్టుకుంటుంది. ఇక పాటలు కూడా కొన్ని సార్లు సంబంధం లేకుండా వచ్చినట్లు అనిపిస్తాయి. అవసరమైన దాని కంటే ఎక్కువ పాత్రలు ఈ సినిమాలో కనిపిస్తాయి. కనీసం వారికి కొన్ని డైలాగ్స్ రాసినా బాగుండేదేమో. ఎమోషనల్ పార్ట్ కూడా డీసెంట్ గా ఉంటుంది. కానీ దాని మీద ఇంకొంచం శ్రద్ద పెట్టి ఉంటె బాగుండేదని అనిపిస్తుంది.