Advertisement
శివాని రాజశేఖర్ పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో రాబోయే హీరోయిన్. ఇప్పటికే ఆమె తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటోంది. తండ్రి యొక్క వారసత్వాన్ని నిలబెడుతూ తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ఈ అమ్మడు “అద్భుతం” సినిమాతో నటిగా మంచి గుర్తింపు సంపాదించింది. నటిగా ఎంతో ఎత్తుకు ఎదగాలని కలలుగంటున్న ఈ అమ్మడు మిస్ ఇండియా అనిపించుకోవాలనేది ఆమె కోరిక. దీనికోసం ఆమె ఎన్నో ఏళ్లుగా చాలా కష్టపడుతుంది. క్యాట్ వాక్ లు నేర్చుకుంది.
మిస్ ఇండియా పోటీల కోసం చాలా కష్టపడింది. ఎంతగానో ప్రాక్టీస్ చేసింది. త్వరలోనే పోటీల్లో పాల్గొనాల్సి ఉండగా, అనూహ్యంగా మిస్ ఇండియా కాంటెస్ట్ నుండి తప్పుకుంది శివాని రాజశేఖర్. ఈ విషయాన్ని స్వయంగా తానే ప్రకటించింది. దురదృష్టవశాత్తూ అందాల పోటీ కి సంబంధించి కొన్ని సెషన్స్ మిస్ అయ్యానని, మెడికల్ థియరీ ఎగ్జామ్స్ వల్ల, ఇలా జరిగిందని, దీని తర్వాత మలేరియా బారిన పడ్డాను. నా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఇంకా ముందుకు జరిగాయి.
Advertisement
Also Read: Pakka Commercial Review: పక్కా కమర్షియల్ రివ్యూ
ఈరోజు నుంచి ప్రాక్టికల్స్ మొదలయ్యాయి. మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే జరగనున్న జూలై 3 రోజు కూడా నాకు ఎగ్జామ్ ఉంది. ఈ కారణం వల్ల మిస్ ఇండియా పోటీల్లో భాగం కాలేక పోతున్నానని తను ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా తనకు సహకరించిన వ్యక్తులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం హెల్త్ పరంగా కోలుకుంటున్నానని ఎగ్జామ్స్ అన్నీ సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తానని ప్రకటించింది శివాని.
Advertisement
also read; లవర్ బాయ్ పేరు తెచ్చుకొని కనబడకుండా పోయినా టాప్ హీరోస్.. ఎవరంటే..?