Advertisement
మిజోరంలో కొత్త ముఖ్యమంత్రిగా అధికారం లోకి వచ్చిన జోరం పీపుల్స్ మూమెంట్ పార్టీ అధ్యక్షుడు లాల్ దుహామా ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితులను దృష్టి లో పెట్టుకుని ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులు కోసం కొత్త కారులని కొనుగోలు చేయకూడదని, నిర్ణయం తీసుకున్నారు. కార్లు కొనివ్వడం వలన ప్రజల సొమ్ము వృధా అవుతుంది అని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వ హయాం లో ఎమ్మెల్యేలు మంత్రులు వాడిన వాహనాలని కొనసాగించాలని చెప్పారు.
Advertisement
గత ప్రభుత్వం లో మంత్రులు ఎమ్మెల్యేలకు ఇచ్చిన సౌకర్యాలతో పోలిస్తే దాదాపు 50 శాతం సౌకర్యాలని తగ్గిస్తున్నట్లు చెప్పారు. మిజోరం సర్కార్ రైతుల సంక్షేమం కోసం పని చేస్తుందని రాష్ట్రాన్ని అవినీతి రహితంగా మార్చడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు పని చేయాలని చెప్పారు.
Advertisement
రాష్ట్రం లో ఇప్పటి దాకా నమోదైన అవినీతి కేసులపై సిబిఐ తో పాటు విచారణ జరిపిస్తామని అన్నారు. గత ప్రభుత్వాలు ఆమోదం తెలిపిన కాంట్రాక్ట్ పనులు ఇప్పటికే మొదలయ్యాయని, ఎలాంటి ఇబ్బందులు వాటి వలన ఉండవని చెప్పారు అయితే ప్రాజెక్టుల్లో నాణ్యత లేకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బయోమెట్రిక్ పద్దతి ని కూడా ఏర్పాటు చేశామని దీని వలన ప్రభుత్వ కార్యాలయాలు సిబ్బంది హాజరు శాతం పెరుగుతుందని ఆయన చెప్పారు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!