Advertisement
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇప్పటిదాకా ఆమె మూడు సార్లు అధికారుల ముందుకు వెళ్లారు. మొదటిసారి మార్చి 11న ఆమెను ప్రశ్నించారు అధికారులు. ఆ తర్వాత 20, 21 తేదీల్లో వరుసగా విచారించారు. అయితే.. మొదటి రెండు పర్యాయాలు సైలెంట్ గా ఈడీ విచారణకు వెళ్లిన కవిత.. మూడోసారి మాత్రం తన ఫోన్లను చూపిస్తూ.. ఈడీకి వ్యతిరేకంగా లేఖ విడుదల చేసి కాస్త హడావుడి చేశారు. మరోసారి విచారణ ఉంటుందని ఈడీ చెప్పినా.. డేట్ ఫిక్స్ చేయలేదు.
Advertisement
కవిత హైదరాబాద్ వచ్చి తన పనుల్లో బిజీగా ఉన్నారు. ఇష్యూ సైలెంట్ అయిపోయింది. అయితే.. సడెన్ గా కవితకు మళ్లీ నోటీసులు పంపించారు ఈడీ అధికారులు. ఆమె ఇచ్చిన ఫోన్ల లాక్ కు సంబంధించి రమ్మని పిలిచారు. అయితే.. కవిత లీగల్ అడ్వైజర్ సోమా భరత్ ఆమె తరఫున ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఫోన్ల పరిశీలనకు ఆథరైజ్డ్ పర్సన్ ను పంపించమని ఈడీ తెలపడంతో భరత్ ఈడీ ముందుకు వెళ్లారు. సుమారు ఐదు గంటల పాటు భరత్ ను విచారించింది ఈడీ.
Advertisement
కవిత మార్చి 21న సమర్పించిన సెల్ ఫోన్లను ఈడీ భరత్ ముందు ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. అందులో కీలక సమాచారం ఉండొచ్చని ఈడీ భావిస్తున్నా.. వాటిలో ఏం ఉండదని కవిత ఫోన్లను అప్పజెప్పడాన్ని చూసిన కొందరు అంచనా వేస్తున్నారు. మరోవైపు కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. చట్టప్రకారం మహిళలను వారి ఇంటి దగ్గరే విచారించాల్సి ఉన్నా.. ఈడీ కార్యాలయానికి తనను పిలవడాన్ని సవాల్ చేస్తూ ఆమె మార్చి 14న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాదులు 15న ధర్మాసనాన్ని కోరారు.
సీజేఐ మాత్రం ఈనెల 24న విచారిస్తామని ముందు చెప్పగా.. ఆరోజు విచారణకు రాలేదు. 27వ తేదీన జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ఈ కేసుపై విచారించింది. విచారణను ఈడీతో కాకుండా.. కోర్టు పర్యవేక్షణలోని సిట్ ఏర్పాటు చేసి విచారణ చేయాలంటూ కవిత కోరారు. ఈడీ సమన్లు రద్దు చేయాలని.. మహిళలను ఇంటి వద్దే విచారణ చేయాలని.. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. కవిత తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.
ఈడీ తనను అరెస్ట్ చేయొద్దన్న కవిత అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే.. ఈడీ సమన్లపై కోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదు. కేసు విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.