Advertisement
సినిమా అనేది రంగు ప్రపంచం. ఎప్పుడు హిట్ వస్తుందో, ఎప్పుడు ఫ్లాప్ వస్తుందో తెలియని పరిస్థితి. అయితే, ఒకప్పటిలా సినిమాకి మౌత్ టాక్, క్రిటిక్స్ టాక్ బాగా వచ్చినంత మాత్రాన సినిమా బాక్సాఫీస్ వద్ద బాగా ఆడింది లేదు. అందుకు కొన్ని సినిమాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నిజానికి అలాంటి సినిమాల కోసమే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. 2022లో కొన్ని సినిమాలకు రిలీజ్ రోజు చాలా మంచి టాక్ సంపాదించుకున్నాయి. కానీ బాక్సఫీస్ వద్ద ఈ సినిమాలు ఆశించిన రేంజ్ లో ఫలితాలను అందుకోలేకపోయాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
# 18 పేజెస్:
నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ మూవీ రిలీజ్ రోజున పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ బ్రేక్ ఈవెన్ కావడానికి చాలా కష్టపడుతుంది. 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ రూ.8.32 కోట్ల షేర్లు మాత్రమే రాబట్టింది.
# భీమ్లా నాయక్:
పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్లో భీమ్లా నాయక్ వచ్చింది. మొదటి రోజు ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ భారీ వసూళ్లు సాధిస్తుంది అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద జోరు చూపించింది లేదు.
# అంటే సుందరానికి:
నాని హీరోగా నజ్రియా ఫహాద్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి ‘బ్రోచేవారెవరురా’ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకుడు. మొదటి రోజు ఈ మూవీకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ నిరాశపరిచింది.
# విరాటపర్వం:
రానా, సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీకి రిలీజ్ రోజున పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ బాక్సఫీస్ వద్ద మాత్రం పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. రూ. 13.6 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ ఫుల్ రన్ ముగిసే సరికి కేవలం రూ.4.23 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బయ్యర్లకు రూ. 9.37 కోట్ల నష్టాలు వచ్చాయి.
# సమ్మతమే:
కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా నటించిన ఈ మూవీకి రిలీజ్ రోజు మంచి టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితంతో మాత్రమే సరిపెట్టుకుంది. రూ.4.5 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ ఫుల్ రన్ లో రూ. 3.10 కోట్ల షేర్లు మాత్రమే రాబట్టింది.
Advertisement
# అశోకవనంలో అర్జున కళ్యాణం:
విశ్వక్సేన్ హీరోగా నటించిన ఈ మూవీకి కూడా మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ బాక్సఫీస్ వద్ద నిలబడలేకపోయింది. రూ. 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ ఫుల్ రన్ లో రూ.4.57 కోట్ల షేర్ మాత్రమే కాబట్టి కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలింది.
# గాడ్ ఫాదర్:
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటి రోజు సూపర్ హిట్ టాక్ వచ్చింది. అయితే రూ. 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. కానీ ఫుల్ రన్ లో కేవలం రూ. 58.65 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి, బయ్యర్లకు రూ. 33.35 కోట్ల నష్టాలను మిగిల్చి డిజాస్టర్ గా మిగిలింది.
# స్వాతిముత్యం:
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందిన ఈ మూవీ చిన్న సినిమాగా రిలీజ్ అయినప్పటికీ రిలీజ్ రోజు సూపర్ హిట్ టాక్ ను రాబట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ. 4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి కేవలం రూ.0.96 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఓవరాల్ గా బయ్యర్లకు ఈ మూవీ రూ.3.04 కోట్ల నష్టాలను మిగిల్చి కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలింది.
# ఓరి దేవుడా:
విశ్వక్సేన్ హీరోగా నటించిన ఈ మూవీలో వెంకటేష్ కూడా కీలకపాత్ర పోషించాడు. ఓ మై కడవులే కి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు సూపర్ హిట్ టాక్ ను రాబట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద రూ.5.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ. 5.55 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి అబౌవ్ యావరేజ్ గా ఫలితంతో సరిపెట్టుకుంది.
# ఊర్వశివో రాక్షసివో:
అల్లు శిరీష్ హీరోగా నటించిన ఈ మూవీకి మొదటి రోజు హిట్ టాక్ లభించింది. కానీ బాక్సాఫీస్ వద్ద రూ.6.75 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్ లో కేవలం రూ.3.32 కోట్ల షేర్లు మాత్రమే రాబట్టింది. బయ్యర్లకు ఈ మూవీ రూ.43 కోట్ల నష్టాలను మిగిల్చింది.
Read also: SAMANTHA : సమంత ఆస్తుల విలువ ఎంతంటే..?