Advertisement
సినిమా రంగం చిత్ర విచిత్రమైనది. టోటల్ గా ఆడియన్స్ ఇచ్చే తీర్పును బట్టి సినిమాల భవిష్యత్తు ఉంటుంది. ఒక్కోసారి పాజిటివ్ టాక్ వచ్చినా, సినిమాలో అనూహ్యంగా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవుతాయి. అలాగే మరికొన్ని తొలిరోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకొని తర్వాత అనుహ్యాంగా పుంజుకుని హిట్ అయిపోతుంటాయి. అలా 2022లో ఫ్లాప్ టాక్ తో మొదలయ్యి, హిట్ సొంతం చేసుకున్న సినిమాల గురించి తెలుసుకుందాం.
Advertisement
# బంగార్రాజు:
నాగార్జున-నాగచైతన్య కాంబినేషన్ లో ‘సోగ్గాడే చిన్నినాయన’ కి సీక్వెల్ గా రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లే సాధించింది. రూ.39 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ రూ.40 కోట్ల షేర్ ను రాబట్టింది.
# సర్కారు వారి పాట:
మహేష్ బాబు హీరోగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి మొదటి రోజు డిజాస్టర్ టాక్ వచ్చింది. కానీ రూ.121 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ ఫుల్ రన్ లో రూ.112.94 కోట్ల షేర్ ను రాబట్టి యావరేజ్ ఫలితాన్ని అందుకుంది.
Advertisement
# ఎఫ్ 3:
అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2 ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన ఈ మూవీ మొదటి రోజు మిక్స్డ్ టాక్ ను మూట కట్టుకుంది. కానీ రూ. 64 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ ఫుల్ రన్లో రూ.55.2 కోట్ల షేర్ ను రాబట్టి యావరేజ్ ఫలితాన్ని అందుకుంది.
# గాలోడు:
సుడిగాలి సుదీర్ హీరోగా నటించిన ఈ మూవీకి మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద రూ.2.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ, రూ.3.5 కోట్ల వరకు షేర్ ను కాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించింది.
# ధమాకా:
రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. అయితే రూ.20.70 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు రూ.37 కోట్ల షేర్ ను సాధించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
READ ALSO: తారకరత్న జీవితంలో ఇలా కూడా మోసపోయారా ? ఇన్ని కష్టాలను ఎలా భరించగలిగారు ?