Advertisement
జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా విడుదల అయింది. ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా నటించిన సినిమా విడుదల అవ్వడంతో అభిమానులు అంచనాలు భారీగా ఉన్నాయి. ఇది ఒక కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించడం జరిగింది. జాలర్లకు సంబంధించిన జీవితాలు పై ఆధారం చేసుకుని ఈ సినిమాను తీశారు. గతంలో కూడా ఇదే బ్యాక్ డ్రాప్ లో కొన్ని సినిమాలు వచ్చాయి, అవేంటో తెలుసుకుందాం.
Advertisement
ఆరాధన
చిరంజీవి, సుహాసిని, రాధిక రాజశేఖర్ కలిసి ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాకు భారతీరాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో చిరంజీవి ఒక జాలరిగా కనిపిస్తారు. పాటలు బాగున్నా సరే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది.
శుభసంకల్పం
కమల్ హాసన్, ఆమని నటించిన ఈ సినిమా విశ్వనాధ్ దర్శకత్వంలో రూపొందించారు. ఈ సినిమాలో కూడా కమల్ హాసన్ జాలరి గా నటించారు. ఈ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది.
సముద్రం
జగపతిబాబు, సాక్షి శివానంద్ జంటగా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా కోస్టల్ బ్యాక్ డ్రాప్ ఆధారంగా తీసినప్పటికీ ఫలితాలు యావరేజ్ గానే నిలిచాయి.
చత్రపతి
ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో రూపొందించిన మొదటి సినిమా ఇదే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో గొప్ప విజయాన్ని అందుకుంది.
గుండెల్లో గోదారి
Advertisement
ఆది పినిశెట్టి, సందీప్ కిషన్, తాప్సీ, లక్ష్మీ మంచు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా లో ఇళయరాజా పాటలు హిట్ అయినప్పటికీ సినిమా మాత్రం డిజాస్టర్ అయింది.
ఉప్పెన
వైష్ణవి తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమా కోస్టల్ బ్యాక్ డ్రాప్ లోనే రూపొందించడం జరిగింది. పైగా ఎంతో మంచి విజయాన్ని సాధించింది.
మహాసముద్రం
శర్వానంద్, సిద్ధార్థ కాంబినేషన్లో రూపొందించిన ఈ మూవీ కూడా కోస్టల్ బ్యాక్ డ్రాప్ లోనే జరిగింది. కాకపోతే ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.
వాల్తేరు వీరయ్య
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా 2023లో సంక్రాంతి కానుకగా విడుదల అయింది. ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు.
దేవర
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా కూడా కోస్టల్ బ్యాక్ డ్రాప్ లోనే రూపొందించారు. దీనిలో ఎన్నో మాస్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అయితే ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.
తండేల్
నాగచైతన్య చందు మొండేటి కాంబినేషన్లో రూపొందిస్తున్న ఈ సినిమా కూడా కౌస్టల్ బ్యాగ్రౌండ్ లోనే, అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందు త్వరలోనే రానుంది.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!