Advertisement
సినిమా రంగం చిత్ర విచిత్రమైనది. టోటల్ గా ఆడియన్స్ ఇచ్చే తీర్పును బట్టి సినిమాల భవిష్యత్తు ఉంటుంది. ఒక్కోసారి పాజిటివ్ టాక్ వచ్చిన, సినిమాలు అనూహ్యంగా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవుతాయి. అలాగే మరికొన్ని తొలిరోజే ప్లాప్ టాక్ తెచ్చుకొని తర్వాత అనూహ్యంగా పుంజుకొని హిట్ అయిపోతుంటాయి. అలా ఫ్లాప్ టాక్ తో మొదలై హిట్ సొంతం చేసుకున్న సినిమాల గురించి తెలుసుకుందాం.
Advertisement
# జల్సా:
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన మొదటి సినిమా ఇది. భారీ హైప్ తో 2008లో రిలీజ్ అయింది. కానీ మొదటి రోజు ఈ చిత్రానికి నెగటివ్ టాక్ వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ క్రేజ్, సమ్మర్ సీజన్ అడ్వాంటేజ్ తో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది.
# సరైనోడు:
అల్లు అర్జున్, బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ 2016లో సమ్మర్ కానుకగా విడుదలైంది. మొదటిరోజు ఈ చిత్రానికి కూడా నెగటివ్ టాక్ వచ్చింది. కానీ సమ్మర్ సీజన్ కలిసి రావడం, మాస్ ఆడియన్స్ చిత్రానికి బ్రహ్మరథం పట్టడంతో సక్సెస్ఫుల్ మూవీ గా నిలబడింది.
# జనతాగ్యారేజ్:
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ 2016 లోనే విడుదలైంది. మొదటి రోజు ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.
# జై సింహ:
Advertisement
బాలకృష్ణ హీరోగా కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2018 సంక్రాంతి కానుకగా విడుదలై, మొదటి రోజు ఫ్లాప్ టాక్ ను మూట కట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.
# సరిలేరు నీకెవ్వరు:
మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ 2020లో విడుదల నెగటివ్ టాక్ ను మూట కట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.
# పుష్ప ది రైజ్:
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం 2021 చివర్లో రిలీజ్ అయ్యి మొదటి రోజే మిక్స్డ్ టాక్ ను మూట కట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ మూవీ అనిపించుకుంది.
# బంగార్రాజు:
నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై మొదటి రోజు నెగటివ్ టాక్ ను మూట కట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బాగానే పెర్ఫార్మ్ చేసింది.
# సర్కార్ వారి పాట:
మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ సమ్మర్ కానుకగా రిలీజ్ అయ్యి మొదటి రోజే మిక్స్డ్ టాక్ ను మూట కట్టుకుంది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ మూవీ గా నిలిచింది.
ఇవి కూడా చదవండి: ఆ నటుడితో భార్యగా, చెల్లిగా, కూతురుగా నటించిన రమ్యకృష్ణ..ఆయన ఎవరో తెలుసా..?