Advertisement
రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద హీరోల సినిమాలు విడుదలయితే రికార్డుల వర్షం కురుస్తుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య విడుదలై రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
Advertisement
#1..RRR :
గతేడాది విడుదలైన ’ఆర్ఆర్ఆర్’ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా అనుకున్నట్టే భారీ విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాలల్లో ఈ సినిమా మొత్తంగా రూ. 272.31 కోట్ల షేర్ రూ. 415 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
# 2. బాహుబలి 2:
రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం మొదటి రోజే తెలుగు రాష్ట్రాల్లో రూ. 43 కోట్లు షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 204 కోట్ల షేర్,రూ. 330 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
#3.సరిలేరు నీకెవ్వరు:
మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 117.50 కోట్ల షేర్, రూ. 177.10 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
#4.బాహుబలి:
Advertisement
రాజమౌళి, ప్రభాస్ కాంబోలో విడుదలైన బాహుబలి సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 22.4 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఓవరాల్‌గా తెలుగు రాష్ట్రాల్లో రూ. 114 కోట్ల షేర్,175.40 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
#5. సైరా నరసింహారెడ్డి:
చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన సైరా సినిమా తెలుగు రాష్ట్రాల్లో 106.4 కోట్ల షేర్,168 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
# 6. రంగస్థలం:
రామ్ చరణ్ హీరోగా దర్శకుడు సుకుమార్ చేసిన మూవీ రంగస్థలం .తెలుగు రాష్ట్రాల్లో 95.27 కోట్ల షేర్,160 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
# 7:సర్కారు వారి పాట:
మహేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా,పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా తెలుగు రాస్ట్రాల్లో రూ. 90.07 కోట్ల షేర్, రూ. 136.05 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది.
#8. పుష్ప :
అల్లు అర్జున్ హీరోగా చేసిన ‘పుష్ప’ మూవీ తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 24.90 కోట్ల రూపాయల వసూళు చేసింది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 85.35 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టింది.
also read