Advertisement
తెలంగాణ సీఎం కేసీఆర్ కి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా ఓ లేఖ రాశారు. సగం నెల గడిచినా ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు రాలేదని లేఖలో పేర్కొన్నారు. యువతకు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడం ఎప్పుడో మారిపోయిన ప్రభుత్వం.. ఉద్యోగులను కూడా పట్టించుకోవడం లేదని అన్నారు. ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న.. ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులను చిన్న చూపు చూడడం సరైనది కాదన్నారు. నేడు జీతాలు ఎప్పుడు వస్తాయో ఎదురు చూడాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటో తేదీనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు జమ చేసేదని, వారికి పీఆర్సీ, డీఏ సమయానికి ఇచ్చేదని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులను రోడ్డున పడేశారని మండిపడ్డారు.
Advertisement
సగం నెల గడిచిపోయిన ఇప్పటి వరకు సర్కార్ ఉద్యోగులకు ఇప్పటి వరకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు పడలేదని, జీతాలు, పెన్షన్లు ఎప్పుడూ పడుతాయో, ఎప్పుడూ మేసేజ్ వస్తుందోనని గంటకోసారి ఫోన్ చూసుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పారు. సగం నెల గడిచిపోయిన జీతం రాకపోవడంతో ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారని అన్నారు. నెలనెలా కట్టాల్సిన ఈఎంఐలు, చెల్లింపులు, లోన్ల కోసం ఇబ్బందులు పడుతున్నారని, జాప్యం కారణంగా కొందరు వడ్డీలు కూడా చెల్లించాల్సి వస్తున్నదని ఉద్యోగులు ఆందోళన చెందుతుని, చివరకు పాల బిల్లులు, కిరాణా బిల్లుల విషయంలో కూడా మాట పడాల్సి వస్తున్నదని ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.
Advertisement
ప్రస్తుతం ఇలా ఉంటే రానురాను నెలనెలా జీతాలు ఇస్తారో లేదోనన్న సంశయం అందరిలోనూ నెలకొందన్నారు. విశ్రాంత ఉద్యోగులు మరింత ఎక్కువ ఆందోళన చెందుతున్నారని, ఎక్కువ మంది పింఛన్ల మీదనే ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓఆర్ఆర్ టెండర్ చేపట్టి, మద్యం దుకాణాలు వేలం వేసి, భూములు అమ్మి బీసీ బంధు, దళిత బంధు అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలకే దోచి పెడుతున్నారు. కానీ ఉద్యోగులకు జీతం మాత్రం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఎవరైనా జీతాల గురించి అడిగితే వారిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఇంత జరుగుతున్న సర్కార్ ఏం చేస్తుందోననే భయంతో నోరు ఎత్తడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తామని, వారికి రావాల్సిన బకాయిలు, పీఆర్సీ చెల్లిస్తామని అన్నారు. అలాగే కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్ అమలు చేస్తున్న విధంగా రాష్ట్రంలో కూడా సీపీఎస్ ను రద్దు చేస్తూ పాత పెన్షన్ పథకాన్ని ఒపీఎస్ అమలుపరుస్తామని అంటూ ఎంపీ కోమటిరెడ్డి లేఖలో వివరించారు.