• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన నాగచైతన్య.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారుగా..!!

బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన నాగచైతన్య.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారుగా..!!

Published on January 25, 2023 by karthik

Advertisement

నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన యాక్షన్ చిత్రం వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే గత ఆదివారం రోజున ఈ మూవీ సక్సెస్ మీట్ ని నిర్వహించింది మూవీ యూనిట్. ఈ సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ సక్సెస్ మీట్ లో బాలకృష్ణ దాదాపు అరగంటకు పైగా స్పీచ్ ఇచ్చారు. స్పీచ్ ఇస్తున్న సమయంలో ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, దర్శకుల తో పాటు నిర్మాత, గెస్టులుగా వచ్చిన ఇతర హీరోలు సైతం వేదికపై ఉన్నారు.

Read also: మంత్రి ఆర్కే రోజా తండ్రి ఎవరు ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?

అయితే ఆర్టిస్టులను, టెక్నీషియన్లు అందరినీ అభినందించిన తర్వాత నిర్మాతలను, కొందరు సహనటులను అభినందించే సమయంలో వారితో తనకి చక్కని టైం పాస్ అయిందని చెబుతూ బాలకృష్ణ నోరు జారారు. “ఈయన ఉన్నాడంటే ఎప్పుడూ కూర్చుని శాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు, ఈ అక్కినేని.. తొక్కినేని.. అన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం” అని అన్నారు. బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు అక్కినేని అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. సోషల్ మీడియా వేదికగా బాలయ్య పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇదే విషయంపై తాజాగా ఆల్ ఇండియా అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement

వెంటనే బాలకృష్ణ స్పందించి అక్కినేని ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. మరోవైపు ” అక్కినేని తొక్కినేని” అంటూ అక్కినేని నాగేశ్వరరావుని కించపరుస్తూ నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై నాగేశ్వరరావు మనవాళ్లు నాగచైతన్య, అఖిల్ స్పందించారు. “నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామ్మతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరచడం అంటే మనల్ని మనమే కించపరుచుకోవడం” అంటూ ట్విట్ చేశారు. బాలయ్య చేసిన వ్యాఖ్యలపై గత మూడు రోజులుగా పెద్ద దుమారం రేగుతోంది. అక్కినేని వారసులు చేసిన ట్వీట్ పై బాలకృష్ణ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

pic.twitter.com/NAuvMrQZtu

— chaitanya akkineni (@chay_akkineni) January 24, 2023

Advertisement

Read also: డైరెక్టర్ కొరటాల శివ భార్య ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మాత్రం కచ్చితంగా హాట్సాఫ్ చెప్పాల్సిందే !

 

Latest Posts

  • సమంత దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన 10 వస్తువులు
  • వివాదాలకు బ్రాండ్ అంబాసిడర్లు.. ఈ తారలు
  • Kantara: కాంతార సినిమాలో మొదట‌గా ఆ స్టార్ హీరోను అనుకున్నారట.. కానీ
  • సినిమాల్లోకి రావడానికి కాంతారా హీరో ఏం చేశాడంటే..?
  • ‘అక్కినేని, తొక్కినేని’ అంటూ బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd