Advertisement
ఎన్నికలతో సంబంధం లేకుండా ఎప్పుడూ కాక రేపుతుంటాయి ఏపీ పాలిటిక్స్. అక్కడ మూడు పార్టీల మధ్య రసవత్తర పోటీ నడుస్తోంది. ఆరోపణలు, పత్యారోపణలు.. విమర్శలు, ప్రతివిమర్శలు ఇలా ఎందులోనూ ఎవరూ తగ్గడం లేదు. ప్రస్తుతం కాపుల సంక్షేమంపై వైసీపీ, జనసేన మధ్య పోటీ నడుస్తోంది. పవన్ ను నమ్మొద్దని జగన్ సేన అంటుంటే.. వైసీపీ ఏం చేసిందని జనసేన నిలదీస్తోంది. పైగా వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా వివాదం పీక్స్ స్టేజ్ కి చేరుకుంది.
Advertisement
ఈ గొడవ జరుగుతుండగానే టీడీపీ ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ హోస్ట్ గా ఉన్న ప్రోగ్రామ్ కు పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వెళ్లడంపై వైసీపీ తనదైన రీతిలో విమర్శలు చేస్తోంది. మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి రాంబాబు చేసిన ట్వీట్ హీట్ పెంచింది. ‘అన్నయ్య షో కి డుమ్మా.. బాలయ్య షో కి జమ్మ.. రక్తసంబంధం కన్నా.. ప్యాకేజీ బంధమే గొప్పదా?’ అని ట్వీట్ చేశారు అంబటి.
Advertisement
ఈ ట్వీట్ పై జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు కౌంటర్ ఇస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ.. ‘ఏయ్.. ముందెళ్ళి పోలవరం సంగతి చూడవోయ్… వె.ధ.వ సోది’ అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. అలాగే జనసేన శ్రేణులు కూడా అంబటిని ఆడుకుంటున్నారు. ఈమధ్య బాధితుల నుంచి కమిషన్లు తీసుకుంటున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలపై రాంబాబు మండిపడ్డారు. నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు. జనసేన నేతలు సీరియస్ గా తీసుకుని బాధితులను మీడియా ముందుకు తీసుకొచ్చి అంబటికి షాకిచ్చారు. రాజీనామా చేస్తావా? అంటూ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.
రాజీనామా పంచాయితీ నడుస్తుండగానే.. కాపుల పంచాయితీ తెరపైకి వచ్చింది. కాపుల్ని పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నారని చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నారని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. మరి.. మీరు చేస్తోంది ఏంటి..? ఊడిగం కాదా? అంటూ సోషల్ మీడియాలో జనసేన శ్రేణులు ఎదురుదాడి కొనసాగిస్తున్నారు. మొత్తానికి రోజుకో గొడవతో వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరుగుతోంది.