Advertisement
మనం ఏ శివాలయానికి వెళ్లినా ముందుగా కనిపించేది నంది మాత్రమే. ఈ నంది అనేది శివుడికి ఎదురుగానే మనకు దర్శనమిస్తుంది. దేశంలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలలో కాశీ విశ్వేశ్వరాలయం కూడా ఒకటి. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ శివాలయం ఉన్నా సరే అందులో శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ప్రతిష్టిస్తారు.. కానీ కాశీ విశ్వేశ్వరాలయంలో మాత్రం నంది ఎదురుగా ఉండదు. అవును..మీరు విన్నది నిజమే. ఆ ఒక్క ఆలయంలో మాత్రమే నందిని ఎదురుగా ప్రతిష్టించలేదు. దానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. అప్పటి కాలంలో ఔరంగాజేబు భారతదేశంపై దండయాత్ర చేసి నప్పుడు భారతదేశంలోని ఆలయాలన్నింటినీ కూల్చివేస్తూ వచ్చారు.
Advertisement
దీనిలో భాగంగానే అతని సైన్యం కాశీ విశ్వేశ్వరాలయం వద్దకు వచ్చి ఆలయ నిర్మాణాన్ని ధ్వంసం చేసారు. అయితే ఆలయ గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని అప్పటి ప్రధాన అర్చకుడు తీసి సమీపంలో ఉన్నటువంటి బావిలో వేశారు. ఆ సైన్యం వచ్చి దాదాపుగా ప్రధాన ఆలయాన్ని ధ్వంసం చేసేసారు. కానీ కొద్ది భాగం శిఖరాలు మిగిలి ఉన్నాయి.ఆ తర్వాత దానిపైన ఇప్పటి జ్ఞానవాసి మసీదును నిర్మించారు. అయితే ఒకప్పుడు ఈ ఆలయం ఉన్న ప్రాంతంలోనే శివలింగానికి ఎదురుగా నంది ఉండేదట. ఆలయాన్ని ధ్వంసం చేసిన సమయంలో వారు నందిని ధ్వంసం చేయలేదు. దీంతో నంది పాదాలయం వద్ద ఉంది.
Advertisement
also raed; ఓడిపోతామని రోహిత్ శర్మకు ముందే తెలుసా.. ఫ్రూఫ్ ఇదిగో!
ఆ ప్రాంతానికి ఇప్పుడు వెళితే అది చూడవచ్చు. అర్చకుడు బావిలో వేసిన శివలింగాన్ని తీసేందుకు చాలా మంది ప్రయత్నించారు. కానీ ఆ బావిలో ఎంత వెతికినా అది దొరకలేదు. ఈ సందర్భంలోనే ఆ లింగాన్ని పోలిన నమూనాతో మరొకలింగాన్ని తయారు చేయించి దాని పక్కనే ఆలయాన్ని నిర్మించారు. కానీ అందులో ఉన్న లింగానికి ఎదురుగా మాత్రం నందిని ఏర్పాటు చేయలేదు. కాశీ విశ్వేశ్వర ఆలయానికి వెళ్తే పాత ఆలయం దగ్గర ఉన్నటువంటి నందిని మనం దర్శించుకోవచ్చు. ఈ విధంగా ఆలయం వద్ద నంది లేదనేది వాస్తవం.
also raed;సూపర్ స్టార్ కృష్ణ ఆస్తుల తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..వీళ్లు అపర కుబేరులే !