Advertisement
Dasara Movie Review in Telugu: నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం “దసరా“. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయణ ఈ చిత్రానికి సంగీతం అందించారు. అలాగే ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయికుమార్, పూర్ణ తదితరులు కీలకపాత్రల్లో కనిపించారు. శ్రీరామనవమి సందర్భంగా మార్చి 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. పక్కా మాస్ మసాలా కథతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ Dasara Movie Review ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
Read also: DASARA MOVIE DIALOGUES: నాని దసరా ట్రైలర్.. ఊర మాస్ డైలాగ్స్ తో అదరగొట్టేశాడుగా..!!
Nani Dasara Movie Story in Telugu : కథ మరియు వివరణ:
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో గోదావరిఖనిలో ఉన్న వీర్లపల్లికి సంబంధించి ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలతో కథ మొదలవుతుంది. బొగ్గు గనులతో వారికి ఉన్న సంబంధం అనే అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. స్వర్గీయ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యపాన నిషేధం మూమెంట్ మొదలవుతుంది. దీంతో వీర్లపల్లిలో స్కిల్ బార్ విషయంలో ఆసక్తికర పరిణామాలు ఏర్పడతాయి. ఇక ఈ చిత్రంలో ధరణి పాత్రలో నాని, వెన్నెల పాత్రలో కీర్తి సురేష్, సూరి పాత్రలో దీక్షిత్ శెట్టి నటించారు. వీరు ముగ్గురు ఒక గ్రూప్ గా ఉంటారు. ధరణి తన స్నేహితులతో కలిసి బొగ్గుని దొంగతనం చేస్తూ, అతిగా మద్యం సేవిస్తూ అందరితో గొడవ పడుతూ ఉంటాడు.
అయితే మద్యం తాగి గొడవ పడుతూ మళ్ళీ మరుసటి రోజు వాటన్నిటిని మరిచిపోతూ ఉంటాడు. ఇలా ఓరోజు సంబి( షైన్ టామ్ చాకో ) యొక్క స్కిల్ బార్ లో గొడవ పడి మరుసటి రోజు వాటన్నింటినీ మరిచిపోతాడు. కానీ ఈ విషయాన్ని సంభీ మాత్రం సీరియస్ గా తీసుకుంటాడు. అయితే ధరణి చేసిన పొరపాటు వల్ల వెన్నెల, అతని స్నేహితుల జీవితాలలో అనేక ఇబ్బందులు నెలకొంటాయి. వారికోసం ధరణి ఏం చేశాడు అన్నదే ఈ మూవీ కథ. ఈ కథలో ధరణి వెన్నెలను ప్రేమిస్తాడు. కానీ వెన్నెల మనసులో మాత్రం సూరి ఉంటాడు. అయితే ఆ తర్వాత ధరణి, వెన్నెల ఎలా కలుస్తారు అన్నది సినిమా యొక్క ప్రాథమిక కథాంశం.
Advertisement
ఈ చిత్రంలో నాని నటన పూర్తి భిన్నంగా ఉంటుంది. ధరణి పాత్రలో నాని అందరికీ నచ్చేస్తాడు. ఇక వెన్నెలగా కీర్తి సురేష్ అదరగొట్టింది. చాలా రకాల భావోద్వేగాలని చూపించాల్సిన ఆ పాత్రకి మంచి న్యాయం చేసింది కీర్తి సురేష్. ఇక నాని స్నేహితుడిగా మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు దీక్షిత్ శెట్టి. ఎవరి పాత్రలలో వారు ఒదిగిపోయారు. ఫస్ట్ ఆఫ్ చాలా అద్భుతంగా ఉంది. రెండో భాగం కాస్త స్లోగా అనిపించినా క్లైమాక్స్ సీన్ మాత్రం అద్భుతం. ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వానికి ఫుల్ మార్క్స్ పడుతున్నాయి. టాలీవుడ్ కి మరో స్టార్ డైరెక్టర్ దొరికేశాడని ప్రేక్షకులు అంటున్నారు. ఇక సంతోష్ నారాయణన్ సంగీతం క్లైమాక్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అరాచకం. ఇంటర్వెల్ సన్నివేశాన్ని కూడా అద్భుతంగా తెరకెక్కించారు. శ్రీకాంత్ ఓదెల గోదావరిఖని ప్రాంతానికి చెందిన వాడు కావడం వల్ల ఆ బొగ్గు గనుల నేపథ్యాన్ని అద్భుతంగా తెలపైన చూపించాడు. ఇక సత్యా సూర్యా గ్రహణం ఈ చిత్రానికి వెన్నెముక అని చెప్పాలి. మొత్తం మీద దసరా ఆకట్టుకునే విధంగా ఉంది.
Also Read: Dasara Movie Dialogues: నాని ఊర మాస్ డైలాగ్స్ తో అదరగొట్టేశాడుగా..!!
ప్లస్ పాయింట్స్:
నాని యాక్టింగ్
నేపథ్య సంగీతం
ఛాయాగ్రహణం
మైనస్ పాయింట్స్:
ఊహించదగ్గ కథనం
కొన్ని బోరింగ్ సన్నివేశాలు
రేటింగ్: 3/ 5