Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం పై చాలా చోట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పలువురు నేతలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణ రాజధానిలో కూడా ఈ వేడి గట్టిగానే తగులుతోంది. ఇక ఐటి పార్క్ వద్ద కూడా కొందరు ఉద్యోగులు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై తమ వ్యతిరేకతను ర్యాలీల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం నిరసనలకు, ర్యాలీలకు ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదు. ఈ క్రమంలో హైదరాబాద్ లో జరుగుతున్న పరిణామాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు.
Advertisement
ఇవి కూడా చదవండి: అమ్మాయిలూ.. పెళ్లి చూపుల్లో అబ్బాయిని ఈ ప్రశ్న కచ్చితంగా అడగండి.. ఆ ఆన్సర్ ఇస్తేనే పెళ్లి చేస్కోండి!
ర్యాలీల అనుమతి విషయమై నారా లోకేష్ తనకు ఫోన్ చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. ర్యాలీలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు అంటూ అడిగారని.. శాంతి భద్రతలు ఏం కావాలని నేను అడిగానని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
Advertisement
ఇవి కూడా చదవండి: 18 నెలల్లో 108 కేజీల వెయిట్ తగ్గించిన అనంత్ అంబానీ ట్రైనర్ గురించి ఈ విషయాలు తెలుసా? ఇతని ఫీజ్ ఎంతంటే?
తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఐటి కారిడార్ లో ర్యాలీలకు అనుమతి ఇవ్వలేదని, ఇక్కడ లేని పంచాయతీని ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్.. అందరు నాకు దోస్తులే అని.. ఆంధ్ర తో నాకు ఎలాంటి తగాదాలు లేవని స్పష్టం చేసారు.
ఇవి కూడా చదవండి: పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ లలో ఎవరు బెటర్? తేల్చుకోవాల్సింది చంద్రబాబే.. అంటూ వైరల్ అవుతున్న పోస్ట్!
ఇక్కడ లేని పంచాయతీని పెట్టి.. ఇక్కడి ఆంధ్ర ప్రజలని ఎందుకు ఇబ్బంది పెడతారని ప్రశ్నించారు. ఏపీతో మాకు ఏమి సంబంధం ఉంది? మాకు ఎందుకు చుడుతున్నారని ప్రశ్నించారు. అక్కడి విషయాల గురించి మా పార్టీ వ్యక్తులు ఎవరైనా మాట్లాడినా అది వారి వ్యక్తిగతమే అని.. అది మా పార్టీ స్టాండ్ కాదని ఆయన స్పష్టం చేసారు.